హైదరాబాద్

ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: నగరంలోని అన్ని హెల్త్ సెంటర్లను బలోపేతం చేస్తామని కలెక్టర్ యోగితా రాణా అన్నారు. గురువారం అంబర్‌పేటలోని సీహెచ్‌సీని సందర్శించినట్లు వివరించారు. అన్ని సీహెచ్‌సీల్లో ప్రజల సౌకర్యార్థం కేసీఆర్ కిట్ వంటి ఇతర స్కీంల గురించి తెలుగు, ఉర్దూ భాషల్లో రాసి ప్రదర్శించాలని కూడా ఆదేశించారు. అంబర్‌పేట సీహెచ్‌సీ ప్రసూతి వార్డులో 2వ కాన్పు కోసం వచ్చిన మలేఖాబేగంతో కలెక్టర్ ముచ్చటించారు. కేసీఆర్ కిట్ గురించి ముందే తెలుసా? కిట్ ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది ఏమైనా డబ్బులు అడిగారా? అని ఆరా తీశారు. మందులను బయటి నుంచి తెచ్చుకోమంటున్నారా? అని అడిగి తెలిసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అంబర్‌పేట, లాలాపేట సీహెచ్‌సీల్లో గరిష్టంగా 300 కాన్పులు అయ్యేలా అవసరమైన సిబ్బంది, డాక్టర్లు, సదుయాలనను వివరిస్తూ పూర్తి స్థాయి నివేదికను తనకు అందజేయాలని ఆదేశించారు. సీహెచ్‌హీలకు వస్తున్న కేసుల వివరాలను క్యాటగిరీల ప్రకారంగా తనకు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, దీని లక్ష్యాన్ని నీరుగార్చకుండా అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. కేసీఆర్ కిట్‌తో గర్భిణులు తమ పేర్లను నమోదు చేసుకునేటపుడు, ప్రసవం తర్వాత, శిశువు మూడున్నర నెలల్లో మొదటి వ్యాక్సిన్ ఇచ్చినపుడు, తొమ్మిది నెలల వయస్సులో టీకా ఇచ్చనపుడు ఎంతెంత మొత్తం చెల్లిస్తారో పూర్తి వివరాలను ప్రతి సీహెచ్‌సీ, పీహెచ్‌సీ గోడలపై వివరంగా రాయించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు, పిల్లలకు అందజేసే పౌష్టికాహారం, గుడ్లు, బాలామృతం వంటి వివరాలను కూడా గోడలపై రాయించాలని సూచించారు. ఆశావర్కర్లు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించటం లేదని అసహనం వ్యక్యం చేశారు. సీహెచ్‌సీల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రతి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు డీఎంహెచ్‌ఓ డా.సరళకుమారి, లాలాపేట సీహెచ్‌సీకు చెందిన డీ.రాజశ్రీ, అంబర్‌పేట ఎస్‌పీహెచ్‌ఓ డా.అచ్యుతరావు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలలో అన్ని వసతులు కల్పన
బోరబండ ఎస్‌ఆర్‌ఎస్‌పురం గురుకుల బాలికల పాఠశాలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, కావల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే పంపాలని అధికారులను కలెక్టర్ యోగితా రాణా ఆదేశించారు. గురువారం పాఠశాలను సందర్శించి తరగతి గదులను, కిచెన్‌ను, డార్మెటరీ డైనింగ్, లైబ్రరీ, ల్యాబ్‌ను తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులకు సంబంధిత ఈఈ సాంబయ్యతో చర్చించారు. స్కూల్‌లోని 420 మంది బాలికలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా వసతులు కల్పించేందుకు అంచనాలను రూపొందించి, తనకు అందజేస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామని అన్నారు. అన్ని తరగతి గదులకు డార్మెటరీ, మెష్ డోర్లు, కిటికీలు, ల్యాబ్‌లో గ్లాస్ అల్మారాలు, టేబుల్లు, లైబ్రరీలో టైబుల్లు, బెంచీలు, సెప్టిక్ ట్యాంక్‌లు, టాయిలెట్లకు మరమ్మతులు, అన్ని గదుల్లో సరిపడే ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, కిచెన్‌లో అవసరమైన వంట పాత్రలు సమకూర్చేందుకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. మరుగుదొడ్లను పరిశీలించిన కలెక్టర్ అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 7వ తరగతి చదువుతున్న అనూషతో కలెక్టర్ ముచ్చటిస్తూ స్కూల్‌కు ఎందుకు వస్తారని ప్రశ్నించగా, డాక్టర్ అయ్యేందుకని సమాధానం చెప్పింది. డాక్టర్ అయ్యాక ఇక్కడే ఉంటావా? విదేశాలకు వెళ్తావా? అని ప్రశ్నించగా, విద్యార్థిని సమాధానం చెప్పలేకపోయింది. నీకు తెలిసిన దేశాల పేర్లు చెప్పమని ప్రశ్నించినా సమాధానం రాలేదు. పాఠశాలలోని టీచర్లకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణను సిద్దం చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్‌ఈఎం శ్రీవత్సకోట, ఈఈ సాంబయ్య, డిప్యూటీ విద్యాశాఖ అధికారి సామ్యూల్, ప్రిన్సిపల్ మరియమ్మ ఉన్నారు.

లక్ష్యంతో ముందుకు వెళ్లాలి
చార్మినార్, జనవరి 18: విద్యార్థులు కష్టపడి చదువుతూ, ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలని రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పాత, కొత్తల సమ్మేళనంగా, ఘనంగా గురువారం జరిగిన నగరంలోని సిటీ కాలేజీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నవీన్ మాట్లాడుతూ ఎక్కువ శాతం విద్యార్థులు సమాధానాలను బట్టీకొట్టి రాస్తూ, తమ పనైపోయిందనే భ్రమలో ఉంటారని, నేర్చుకునే అంశం, ఎక్కడ, ఎందుకు ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుసుకోవటం లేదని అన్నారు. ఈ రకంగా చదువులు పూర్తి చేయడం మంచి పరిణామం కాదని చెప్పారు.
క్రీడా, విద్యా రంగాల్లో ఏదైనా కష్టపడి నేర్చుకున్నపుడే విద్యార్థులు రాణిస్తారని పేర్కొన్నారు. సిటీ కాలేజీకి న్యాక్ 3.26 ర్యాంకింగ్ రావటం అభినందనీయమని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, ఎగ్జామ్స్ కంట్రోలర్ ఎం.కుమార్‌తో పాటు సిటీకాలేజీ ప్రిన్సిపల్ డా.సీ.మంజులత, ఎగ్జామ్స్ కంట్రోలర్ డా.జే.చినబాబు పాల్గొన్నారు.