హైదరాబాద్

అక్రమ గుట్కా తయారీ కేంద్రంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: నగరంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తున్న రెండు స్ధావరాలపై టాస్క్ఫోర్స్ దక్షిణ మండలం అధికారులు దాడి చేశారు. అక్కడ అక్రమంగా తయారు చేసిన 80 బస్తాల గుట్కా ప్యాకెట్లతో పాటు గుట్కా తయారు చేసే 8 యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి వివి శ్రీనివాసరావు తెలిపారు.
గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితులు సుజాత్ ఆలీఖాన్, ఖాజా సలీముద్దీన్, మహ్మద్ రహీముద్దీన్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. చాంద్రాయణగుట్ట సమీపంలోని ఇస్మాయిల్ నగర్‌లో ఉన్న అనుమతిలేని గుట్కా తయారీ కేంద్రాలపై దాడులు చేసినట్లు వివరించారు. గత కొన్ని నెలలుగా సుమారు 60 మంది కార్మికులను పనిలో పెట్టుకుని గుట్కాను తయారు చేసి మహారాష్టల్రో ఉన్న తమ వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీనిలో పని చేసే వారందరిని ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తీసుకువచ్చారు. నకిలీ ఉత్పత్తులు, నిషేధిత ఉత్పతుల తయారీపై కఠినంగా వ్యవహరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించి కల్తీని, అక్రమ వ్యాపారాన్ని అరికడుతున్నట్లు సిపి వెల్లడించారు. నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. విలేకరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ అదనపు డిసిపి ఎస్.చైతన్య కుమార్, ఇన్‌స్పెక్టర్ కె.మధు మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.