హైదరాబాద్

26న భారతమాత కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: యువతలో భారతీయ విలువలు పెంపొందించేందుకు, సమాజంలో నైతికతకు భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన భారీ ఎత్తున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు తెలిపారు. భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారతమాత మహా హారతి కార్యక్రమం 26న పీపుల్స్ ప్లాజాలో జరుగుతుందని చెప్పారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వందేమాతరం, జై హింద్, భారత మాతాకీ జై అనే పదాలు వినగానే ప్రతి భారతీయుడికీ మనసు పులకరిస్తుందని, మనసు ఆనందభరితమవుతుందని అన్నారు. ప్రత్యేకమైన అనుభూతి మనసును కదిలించి వేస్తుందని, ఒక భావావేశం తనువంతా రోమాంచితం చేస్తుందని పేర్కొన్నారు. మహాహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పరిపూర్ణానంద స్వామి హాజరవుతారని చెప్పారు. భారతమాత ఫౌండేషన్‌కు జి కిషన్‌రెడ్డి చైర్మన్‌గానూ, డాక్టర్ రమేష్ , కె రాములు, జి పాండురంగారావు, చింతల రామచంద్రారెడ్డిలు ప్యాట్రన్‌లుగా ఉంటామని, కన్వీనర్‌గా బి శ్యాంసుందర్ గౌడ్ వ్యవహరిస్తారని, రావుల శ్రీ్ధర్‌రెడ్డి కో కన్వీనర్‌గా ఉంటారని పేర్కొన్నారు.

రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా

హైదరాబాద్, జనవరి 18: స్వచ్ఛసర్వేక్షణ్-2018కు సమయం దగ్గరపడుతుండటంతో స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. గడిచిన కొద్ది నెలలుగా ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు రకరకాల కార్యక్రమాలను చేపట్టిన బల్దియా, ఇపుడు నిబంధనలను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలు వసూలు చేయటం, విపత్తులు సంభవించినపుడు సకాలంలో అక్కడకు చేరుకుని ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టేలా నెలరోజుల్లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్(జాతీయ విపత్తుల నివారణ సంస్థ) బృందాల తరహాలో పనిచేసే విధంగా ఆధునిక యంత్ర సామాగ్రిని సమకూర్చటంతో పాటు సహాయక చర్యలకు సంబంధించి సాంకేతిక అంశాలపై ప్రత్యేక శిక్షణను కూడా ఇప్పించనున్నట్లు మేయర్ వెల్లడించారు.