హైదరాబాద్

ఓఎన్‌జీసీలో ఫీల్డ్ ఆపరేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించండి : హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ఓఎన్‌జీసీ సంస్థలో పనిచేస్తున్న ఫీల్డ్ ఆపరేటర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, వీరు గత 12 నెలల్లో 240 రోజులు పనిచేశారని హైకోర్టు ఓఎన్‌జీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. 2016 డిసెంబర్‌లో సింగిల్ జడ్జి కోర్టు ఫీల్డ్ ఆపరేటర్ల సేవలను క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. వీరు ఆంధ్ర, తెలంగాణలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని కోర్టు పేర్కొంది. కాగా సింగిల్ జడ్జి కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఓఎన్‌జిసి యాజమాన్యం హైకోర్టుడివిజన్ బెంచిలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎం గంగారావుతో కూడిన ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి కోర్టును అమలు చేయాలని ఓఎన్‌జిసి యాజమాన్యాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.
కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్‌కు గ్లోబల్ ఎనర్జీ అవార్డు

హైదరాబాద్, జనవరి 18: ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో 27 వేల మంది గిరిజన బాల బాలికలకు ఉచిత విద్యను , ఉచిత హాస్టల్‌ను అందిస్తున్న కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ సంస్థకు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎనర్జీ అవార్డు దక్కింది. ఇరాన్ రాజధాని టెహరాన్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలస్‌లో ఈ పురస్కారాన్ని అందజేసినట్టు కళింగ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ అచ్యుత సామంత తెలిపారు. 178 దేశాల నుండి 2200 ప్రాజెక్టుల నుండి తమ సంస్థ సమర్పించిన ప్రాజెక్టు ఉత్తమమైనదిగా ఎంపికైందని, తుది జాబితాలోకి భారత్, స్పెయిన్, థాయిలాండ్ దేశాలు నిలవగా అందులో భారత్ నుండి తాము మాత్రమే ప్రాతినిధ్యం చేశామని పేర్కొన్నారు. కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్‌తో పాటు కైట్ సంస్థ కూడా ఈ ఏడాది అద్భుత విజయాలు సాధించిందని చెప్పారు.