హైదరాబాద్

గ్రూప్-2 అభ్యర్థులకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జనవరి 19: హైకోర్టులో ఉన్న స్టే ఎత్తివేయడానికి ప్రభుత్వ పరంగా చర్వలు తీసుకుని గ్రూపు-2 సర్వీసు ఉద్యోగాలకు వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో
అభ్యర్ధుల మద్దతుదారులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆఫీసును ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గ్రూపు-2 అభ్యర్ధులు ఏర్పాటు చేసిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హైకోర్టు స్టే ఎత్తివేయడంలో ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రయత్నాలు జరగటం లేదని, ఒకరకంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని వాపోయారు. ఫలితంగా గ్రూపు-2కు ఎంపికైన దాదాపు 3వేల మంది అభ్యర్ధులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. స్టే ఎత్తి వేయడానికి ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా ఒత్తిడి తీసుకరావడం పెద్ద పనేమీ కాకపోయినా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇరవై ఒక్క జిల్లాలో 40పై చిలుకు ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాలలో ఉద్యోగులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూన్నారని తెలిపారు.
ఉద్యోగుల కోరతతో ప్రజా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కల్గుతోందన్నారు. ఈ విషయంపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడకుండా తగిన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. కేవలం మూడు వేల మందికి ఉద్యోగాలివ్వటం ప్రభుత్వానికి పెద్ద పనేమీ కాదని, అయినా ఆ దిశగా చొరవ చూపటం లేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులతో పాటు గ్రూప్-2కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలను కేటాయించాలన్నారు. లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున నిరుద్యోగ ఉద్యమాన్ని చేపడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రామలింగం, భూపేష్‌సాగర్, సతీష్, గ్రూప్-2 అభ్యర్థులు స్రవంతి, గీత, జ్యోతిరెడ్డి, మాధవి, రజిత, విక్రమ్, రవికిరణ్, గోపాల్, మధుకర్, రమణ, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.