హైదరాబాద్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో.. తారలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 21: మహానగర వాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ సినీ ప్రముఖులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2018లో దేశంలోనే నెంబర్ 1గా నిలవడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. నగరంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ శుభ్రత గురించి తెలుసుకొని పాటించేలా చేయడం కోసం వీటిని సర్కిళ్ల వారీగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాలనీలు, బస్తీలకు సినీ నటీనటులను తీసుకువెళ్లి వారితో తడి, పొడి చెత్త వేరుచేయడం, అపరిశుభ్ర వాతావరణం వల్ల కలిగే ఇబ్బందులు, పరిశుభ్రత పాటించడంవల్ల చేకూరే ప్రయోజనాలు తదితర అంశాలను వివరిస్తున్నారు. కంపోస్టు గుంతల ఏర్పాటు, భూగర్భ జలాలను పరిరక్షించడంలో ఇంకుడు గుంతల పాత్రను విరించడం, వాటిని నిర్మించుకునే విధానాలను బోధిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో నటుడు సంపూర్ణేష్‌బాబు పాల్గొని అక్కడి ప్రజలకు స్వచ్ఛ పాఠాలను బోధించారు. గతంలో నటి అమల సైతం పాల్గొని ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించిన విషయం విధితమే. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసి ఎంత కృషి చేస్తున్నా ప్రజల్లో అవగాహన లోపం, తదితర కారణాలవల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని గమనించిన అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.