హైదరాబాద్

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 21: జూబ్లీహిల్స్‌లో ఓ కారు అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ 1/45 చౌరస్తా వద్ద మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డుపై సీసీ కెమెరాలు బిగించేందుకు ఏర్పాటుచేసిన స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఆ స్తంభం రెండుగా విడిపోయింది. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్టయింది. సంఘటన అనంతరం డ్రైవర్ కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కారును అక్కడి నుంచి పక్కకుతీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫరీద్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేసినట్టుగా గుర్తించారు. ఫరీద్ మద్యం మత్తులో ప్రమాదం చేశాడా లేక నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగిందా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.