హైదరాబాద్

‘జలం-జీవం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించటం, భూగర్భ జలాలను పెంచుకునేందుకు వారిని భాగస్వాములను చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఎట్టకేలకు ‘జలం-జీవం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వచ్చే నెల 1వ తేదీలోపు నగరంలోని జీహెచ్‌ఎంసీకి చెందిన క్రీడామైదానాలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు ఇతర ఖాళీ స్థలాల్లో మొదటి దశలో 300 ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అంతేగాక, వీటి నిర్వాహణ బాధ్యతలను స్థానిక కాలనీసంమ సంఘంలు, స్వచ్ఛంద సంస్థలు, బాధ్యతాయుతమైన పౌరులకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వందలాది ఇంకుడు గుంతలను నిర్మించినా, సరైన నిర్వాహణ లేకపోవటంతో ప్రస్తుతం ఆ గుంతల్లో చెత్తాచెదారం చేరి, అవి నిరుపయోగంగా పడి ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇలాంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గుంతలను ఏర్పాటు చేసిన వెంటనే వాటి నిర్వాహణ బాధ్యతలను స్థానికులకే అప్పగించాలని, ఇందుకు సంబంధించి వారితో జీహెచ్‌ఎంసీ ఒప్పందం చేసుకోనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు, క్రీడామైదానాల్లో ఎక్కడెక్కడ ఈ గుంతలను ఏర్పాటు చేయాలన్న అంశంపై స్థలాలను ఎంపిక చేసే ప్రక్రియ జోరుగా సాగుతుందని అన్నారు. జలం-జీవం కార్యక్రమం కింద నగరాన్ని 400 యూనిట్లుగా విభజించి, ఒక్కో యూనిట్‌కు ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించి వంద శాతం ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. గతంలో నిర్మించిన గుంతలకు కూడా మరమ్మతులు చేయనున్నారు. ఇప్పటికే రూ.7.60 కోట్ల వ్యయంతో 3622 ఇంకుడు గుంతలను ప్రభుత్వ స్థలాల్లో జీహెచ్‌ఎంసీ నిర్మించిందని, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, పాఠశాలు, కళాశాలలు, వ్యక్తిగత భవనాల్లో ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. 100 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించే ప్రతి ఇంటి ఆవరణలో తప్పకుండా ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు వెడల్పుతో ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలని, గుంతలను ఏర్పాటు చేసుకున్న తర్వాతే అక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు జారీ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
11న కాకతీయ రెడ్ల శంఖారావం
ఖైరతాబాద్, జనవరి 22: తెలంగాణ రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11న వరంగల్ కేడీసీ గ్రౌండ్స్‌లో కాకతీయ రెడ్ల శంఖారావాన్ని నిర్వహిస్తున్నట్టు ఐక్య వేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు. సోమవారం పంజాగుట్టలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని రెడ్డి హాస్టల్ చైర్మన్ రఘుపతి రెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం శంఖారావం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రెడ్డి కులస్థులందరూ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నరనే భావన సరికాదని, దయనీయ పరిస్థితులను అనుభవించేవారు అనేక మంది ఉన్నారని అన్నారు. రెడ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, రామిరెడ్డి, రాఘవ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, యన్నం శ్రీనివాస్ రెడ్డి, వసుంధర రెడ్డి పాల్గొన్నారు.
ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ఖైరతాబాద్, జనవరి 22: ఖైరతాబాద్‌లోని రవాణ శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రికార్డులు భద్రపరిచే గదిలో ఏర్పడిన షార్ట్‌సర్య్కూట్‌తో నిప్పురవ్వలు చెలరేగి రికార్డులకు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. రికార్డు గది నుంచి దట్టమైన పొగ వస్తుండటాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కాగా గదిలో భద్రపరిచిన రిజిస్ట్రేషన్ కాగితాలు కొంత మేర కాలి బుడిదయ్యాయి. వాటిని మరో గదిలో భద్రపరిచారు. ఈ అంశంపై ఆర్టీఏ ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.