హైదరాబాద్

మతపెద్దలు సరే అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జనవరి 23: నగరంలో అర్ధరాత్రి వరకు జరుగుతున్న ము స్లింల పెళ్లిళ్ల వ్యవహారంపై మత పెద్ద లు రాజీ ఉంటే, తమ నుంచి ఎలాం టి అభ్యంతరాలు ఉండవని పోలీసు కమిషనర్ శ్రీనివాస రావు తెలిపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం మంగళవారం నాంపల్లి హజ్‌భవన్‌లో మతపెద్దలతో ఏర్పా టు చేసిన సమావేశానికి సీపీ హాజరయ్యారు. సలీం మాట్లాడుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించటంతో పిల్లలు, మహిళలు, వృద్ధు లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రవాణా విషయంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నందున రాత్రి పనె్నండు గంటల్లోపు కార్యక్రమాలను ముగించాలని సూచించారు. ఈ విషయంలో వక్ఫ్‌బోర్డు ఫత్వా కూడా జారీ చేసినట్లు సలీం తెలిపారు. పనె్నండు గంటల వరకు జరిపే కార్యక్రమాలను కూడా ఎక్కువ డబ్బులు వెచ్చించి, విలాసవంతంగా నిర్వహించరాదని సలీం కోరారు. సీపీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ముస్లింల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు అర్ధరాత్రి తర్వాత నిర్వహించరాదనే విషయంపై మత పెద్దలు, ఖాజీలు సమ్మతంగా ఉంటే తాము కూడా ఆ నిబంధనను అమలు చేసేందుకు సిద్ధంగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ తెప్పిస్తే, వారికి సహకారంగా ఉంటుందన్నారు. మతపెద్దలు వాహీద్, ముక్తిఖాలేద్, ఖుబుల్ పాషా పాల్గొన్నారు.