హైదరాబాద్

ప్రభుత్వ ఆసుపత్రులపై పెరిగిన నమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే దిశగా, వాటిని బలోపేతం చేస్తామని జిల్లా కలెక్టర్ యోగితారాణా వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ కింగ్‌కోఠి ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవల గురించి సూపరింటెండెంట్‌ను అడిగి తెల్సుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది ప్రతిరోజు ఖచ్చితంగా ఎనిమిది గంటలు పని చేయాలని, రౌండ్ ది క్లాక్ ల్యాబ్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏ ఒక్క రోగి కూడా డాక్టర్ లేరని, ల్యాబ్ అందుబాటులో లేదనే కారణంతో వెనక్కి వెళ్లకూడదని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఓపీడీ, డెలివరీలు రెట్టింపు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారనే అంశంపై తనకు నివేదికను సమర్పించాలని డీసీహెచ్‌ఎస్ డా.సుజాతకు సూచించారు. ఆసుపత్రిలో గల వైద్యులతో కమిటీలను ఏర్పాటు చేసి శానిటేషన్, డైట్, ఫార్మసీ, ఈ-రిజిస్ట్రేషన్, ఎమర్జెన్సీ వంటి ముఖ్యమైన అంశాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించాలని సూచించారు. డాక్టర్లు, నర్సులు ఇతర పారామెడికల్ సిబ్బంది ఖాళీ పోస్టుల వివరాలను కూడా నివేదికలో తనకు అందించాలని అన్నారు. ఆసుపత్రిలోని నాణ్యమైన సేవలను ప్రజలకు అందించేలా తీసుకోవల్సిన చర్యలను సూచిస్తూ కార్యచరణను రూపొందించాలని సుషత్ ఫౌండేషన్, డైరెక్టర్ హాస్పిటల్ ఇంప్రూవ్‌మెంట్ శితిజ్ మల్హోత్రకు కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శివప్రసాద్, ఆర్‌ఎంఓ డా.సరోజ ఉన్నారు.
25న ‘వీరుల పోరు గద్దె మేడారం’ పుస్తక విడుదల సభ
హైదరాబాద్, జనవరి 23: మొదటిసారి డోలీలు గానం చేసిన సమ్మక్క - సారలమ్మ మహోజ్వల చరిత్రని బహిర్గతం చేస్తున్న పరిశోధక గ్రంథం ‘వీరుల పోరు గద్దె మేడారం’ పుస్తకం విడుదల సభను 25న నిర్వహిస్తున్నామని సాహితీ సర్కిల్ కన్వీనర్ ఏ.వినాయక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొ.జయధీర్ తిరుమల రావు సంపాదకుడిగా, ప్రొ.గూడూరు మనోజ, పద్మం అనసూయ సహ సంపాదకులుగా ఈ చరిత్ర గ్రంథం వెలుగులోకి వస్తోంది. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈనెల 25న మధ్యాహ్నం 12గంటలకు సభ నిర్వహిస్తున్నారు.

‘వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్ర ప్రదర్శన
కాచిగూడ, జనవరి 23: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శ్రీత్యాగరాయ గానసభ, రసాంజలి సంయుక్త ఆధ్వర్యంలో ‘శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ చిత్ర పదర్శన మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో ప్రదర్శించారు. కార్యక్రమానికి తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిందని అన్నారు. జీవిత సత్యాలను తెలియజేసిన చిత్రమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించారని కీర్తించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ఏభూషి యాదగిరి, వై.మల్లికార్జునమ్ పాల్గొన్నారు.