హైదరాబాద్

కోటి మందికి ‘స్వచ్ఛ’చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: స్వచ్ఛతపై ప్రజలను చైతన్యవంతులను చేసి, నగరాన్ని స్వచ్ఛ సిటీగా తీర్చిదిద్దుకోవటంలో భాగంగా ఇప్పటి వరకు నగరంలోని కోటి 20 లక్షల మంది జనాభాలో జీహెచ్‌ఎంసీ కోటి మందికి చైతన్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం స్వచ్ఛసర్వేక్షణ్ 2017లో జీహెచ్‌ఎంసీకి 22వ ర్యాంకు వచ్చింది. మెట్రో నగరాలతో పోల్చితే జీహెచ్‌ఎంసీ మొదటి స్థానా న్ని దక్కించుకున్నా, ఈ ఏటా దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్‌ను చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో స్వచ్ఛ కార్యక్రమాలను కాస్తముందుగానే ప్రారంభించింది జీహెచ్‌ఎంసీ. వీటికి తోడుగానే స్వచ్ఛతపై ప్రజలను అవగాహన వం తులను చేసి, వారంతట వారు పాల్గొనే విధంగా చైతన్యవంతులను చేసేందుకు నిర్వహించిన కార్యక్రమాలను మంచి ఫలితాలనిచ్చాయి. ముఖ్యంగా దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంట్లోనే తడి,పొడి చెత్తను వేర్వేరు చేయాలన్న విషయంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సుమారు 3వేల 500 మంది కమ్యూనిటీ రీసోర్సు పర్సన్స్‌ను నియమించిన ఘనత జీహెచ్‌ఎంసీదే. అంతేగాక, నగరంలోని 20లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారుల సెల్‌ఫోన్లకు ఇప్పటి వరకు రెండుసార్లు ఎస్‌ఎంఎస్‌లను పంపించారు. నగరంలోని 45 వేల స్వయం సహాయక బృందాల్లోని నాలుగున్నర లక్షల మంది సభ్యులకు స్వచ్ఛ కార్యక్రమాలపై చైతన్యవంతులను చేసి, ప్రజల్లో అవగాహన పెంచేందుకు వారి సేవలను వినియోగించుకుంది. ‘స్వచ్ఛ త’పై స్వచ్ఛ నమస్కారం మొదలుకుని, స్వచ్ఛర్యాలీలు, స్వచ్ఛ నినాదా లు, స్వచ్ఛకవి సమ్మేళనాలు, ఇంటింటికి బొట్టు, చెత్తకు విడాకుల దినోత్సవం, చెత్తవారోత్సవాలతో పాటు స్వచ్ఛ ధన్యవాదాలు వంటి కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తోంది. ఈ అంశంపై మాస్ ప్రజలను సైతం ఆకర్షితులను చేసేందుకు భారీ హోర్డింగ్‌లను, బస్ షెల్టర్లపై ప్రత్యేక ప్రకటనలివ్వటంతో పాటు సినీ నటులు, సెలబ్రిటీల ద్వారా స్వచ్ఛ కార్యక్రమాలను ని ర్వహిస్తూ జీహెచ్‌ఎంసీ ప్రజల్లోకి వెళ్ల టం వల్లే మహానగరంలోని జనాభాలో 75 శాతం మందిని అవగాహనవంతులను చేశామని అధికారులు చెబుతున్నారు. అంతేగాక, రెండురోజుల క్రి తం మంత్రి కేటీఆర్ బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన స్వచ్ఛచైతన్య కార్యక్రమానికి 15 వేల పై చిలుకు పౌరులు హాజరయ్యారంటే వారిలో స్వచ్ఛతపై కల్గిన చైతన్యమే ఇందుకు నిదర్శనమని అధికారులు వ్యాఖ్యానించారు.
అంతేగాక, మున్సిపల్ మంత్రి సహా మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలు కూడా వారు హాజరైన ప్రతి కార్యక్రమంలో స్వచ్ఛ సందేశాన్ని విన్పిస్తున్నారు.