హైదరాబాద్

అమ్మాయిలను బాగా చదివించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ‘ఆడ పిల్ల పుట్టిందన్న దిగులు వద్దు, వారిని బాగా చదివించండి..’ అని రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ బుద్దా మురళి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. సరూర్‌నగర్, కొత్తపేటలోని ‘సంస్కృతి’ పాఠశాల 9వ వార్షికోత్సవానికి కమిషనర్ బుద్దా మురళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళి ప్రసంగిస్తూ సమాజంలో మార్పులు సంభవించాయని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులను అధిగమిస్తున్నారని అన్నారు. అమ్మాయిలు రాణించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలన్నారు. ఆడ పిల్ల పుట్టిందన్న దిగులు పెట్టుకోకుండా, వారి బంగారు భవిష్యత్తు కోసం ప్రోత్సహించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. తనకూ ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారనీ, ఏనాడూ వారి కోసం దిగులు చెందలేదని, ఒక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని బుద్దా మురళి చెప్పారు.రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ శ్రీ్ధర్ ఆయాచితం ప్రసంగిస్తూ మాతృ భాషకు ప్రాథాన్యం ఇవ్వాలని అన్నారు. పాఠశాలలో ఏ భాషలో విద్యాభ్యాసం చేసినా, ఇంట్లో మాతృ భాషలోనే మాట్లాడుకోవాలని ఆయన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల అభిరుచిలను బట్టి ప్రోత్సహించాలే తప్ప బలవంతంగా ఏదీ రుద్దవద్దని ఆయన తల్లిదండ్రులనుద్ధేశించి అన్నారు.ఆంధ్రభూమి దినపత్రిక చీఫ్ రిపోర్టర్, రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా సంఘం మాజీ చైర్మన్ వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ విద్యార్థులు విద్యనభ్యసించడం పాటు, జనరల్ నాలెడ్జినీ పెంచుకోవాలని సూచించారు. పాఠ్యాంశాల్లో లేని అనేక ప్రశ్నలు క్విజ్‌ల్లో, పోటీ పరీక్షల్లో, గ్రూపు పరీక్షల్లో, సివిల్స్‌లో వస్తుంటాయని అన్నారు. టివీల్లో వచ్చే క్విజ్ కార్యక్రమాలు చూసి, తాము ఎందుకు పాల్గొనరాదన్న పట్టుదల పెంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతి రోజూ తప్పని సరిగా దినపత్రిక చదువుతూ జనరల్ నాలెడ్జిని పెంచుకోవాలని ఆయన చెబుతూ చార్మినార్, హుస్సేన్ సాగర్‌ను ఎవరు నిర్మించారు?, ఏ సందర్భాల్లో నిర్మించారో ఉదాహరణగా విశదీకరించారు. పాఠశాల కరస్పాండెంట్ తేరాల విక్రాంత్ గుప్తా స్వాగతోపన్యాసం చేశారు. డైరెక్టర్లు ప్రదీప్ తేరాల, విరూపాక్ష, శౌర్య తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ స్వాతి నివేదికను సమర్పించారు. పాఠశాల కౌన్సిలర్ జోత్స్న, శోభ తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాఠశాల 9వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అందరి ప్రశంసలు పొందారు.