హైదరాబాద్

ఛత్తీస్‌గడ్‌పై హైదరాబాద్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: విజయ్ హజారే ట్రోఫీ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు చక్కటి ఆట తీరును ప్రదర్శించడంతో పాటు మహ్మద్ సీరాజ్ బౌలింగ్‌లో రాణించడంతో 84 పరుగుల తేడాతో ప్రత్యర్థి ఛత్తీస్‌గడ్‌పై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు గెలిచి మొత్తం 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, సౌరాష్ట్ర, విదర్భ, ఛత్తీస్‌గడ్ జట్లు ఆరు మ్యాచ్‌ల్లో చేరి నాలుగు మ్యాచ్‌లు గెలుపొంది 16 పాయింట్లు సాధించాయి. విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్-డిలో ప్రథమ స్థానంలో నిలిచిన హైదరాబాద్‌తో పాటు విదర్భ, ఛత్తీస్‌గడ్, సౌరాష్ట్ర జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. టోర్నమెంట్‌లోనే ఎంతో ప్రతితిష్టాత్మకంగా భావించిన హైదరాబాద్‌కు గురువారం ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్ కీలకంగా మారింది. గురువారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 280 పరుగులు సాధించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన సందీప్ 79 బంతులనెదుర్కొని ఒక సిక్సర్, నాలుగు బౌండరీల సహయంతో 79 పరుగులు చేసి ఆర్థ సెంచరీ పూర్తి చేశాడు. కాగా, జట్టులో ఏటీ రాయుడు 46, టి.రవి తేజా 45, ఆకాష్ బండారి 25, కోల్ల సుమంత్ 21 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచారు. 281 పరుగుల విజయ లక్ష్యాంతో బ్యాటింగ్ బరీలోకి దిగిన ఛత్తీస్‌గడ్, హైదరాబాద్ జట్టు బౌలింగ్‌ను తట్టుకోలేక 44.3 ఓవర్లలో 196 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ఛత్తీస్‌గడ్ జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన ఎఎఎన్ ఖారే 71, సంజీత్ దేశాయ్ 47, విశాల్ సింగ్ 26 పరుగులు చేశారు. కాగా, హైదరాబాద్ జట్టు బౌలింగ్‌లో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సీరాజ్ 8.3 ఓవర్లలో కేవలం 37 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకుని పలువురిని అకట్టుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన మరో బౌలర్ మోహిది హాసన్ 38 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్ గెలిచిన హైదరాబాద్‌కు నాలుగు పాయింట్లు సాధించడంతో గ్రూప్-డీలో అగ్రగామిగా నిలిచి క్వార్టర్స్ సునాయాసంగా చేరుకుని పరీశీలకుల అంచనాలను తారుమారు చేశారు.
జమ్ము కశ్మీర్‌పై జార్ఖండ్ గెలుపు
సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ 97 పరుగుల తేడాతో ప్రత్యర్థి జార్ఖండ్ చేతిలో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో రాణించిన విరాట్ సింగ్ 96 పరుగులు చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 296 పరుగులు సాధించింది. కాగా జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన సుమీత్ కుమార్ 35, ఉత్‌కార్ష్‌సింగ్ 31, సౌరాభ్ తివారి 26 పరుగులు చేశారు. జమ్ముకాశ్మీర్ బౌలర్లు ఉమర్ నాజీర్, పర్వేజ్ రాసుల్ చేరి మూడేసీ వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన జమ్ముకాశ్మీర్, జార్ఖాండ్ బౌలింగ్‌ను తట్టుకోలేక 46 ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌటై ఓటమి పాలైంది. జార్ఖండ్ బౌలర్లు వికాష్ సింగ్, అశీష్ కుమార్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, అన్కుల్‌రాయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్ గెలిచిన జార్ఖండ్‌కి నాలుగు పాయింట్లు లభిచడంతో క్వార్టర్స్‌కు అర్హత పొందింది.
విదర్భపై ఎనిమిది వికెట్లతో సౌరాష్ట్ర విజయం
నగరంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో ఏఓసీ సెంటర్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఎనిమిది వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొంది గ్రూప్-డీలో క్వార్టర్స్ ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు 40.5 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో రాణించిన జేఎం శర్మ 55, ఆర్‌ఎల్ జంగీడ్ 22, ఎస్‌ఆర్.రామస్వామీ 29 పరుగులు చేశారు. జవాబుగా బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 34 ఓవర్లలో కేవలం రెండు వికెట్లను కోల్పొయి 161 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని అధిగమించింది. మ్యాచ్ గెలిచిన సౌరాష్టక్రు నాలుగు పాయింట్లు రావడంతో టోర్నీలో క్వార్టర్స్ బర్త్ ఖాయమైంది.