రంగారెడ్డి

మున్సిపాలిటీ వద్దు... గ్రామ పంచాయతీయే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, ఫిబ్రవరి 14: మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటిగా మార్చకుండా గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని కొరుతూ బుధవారం యువజన కాంగ్రెస్ తాలుకా ఉపాధ్యక్షుడు వీరమోని శ్రీను అధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ ముద్దు మున్సిపల్ వద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ కొత్తూరు గ్రామ పూరవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మదారం కృష్ణగౌడ్, వీరమోని శ్రీను మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేస్తూ మున్సిపాలిటీలుగా మార్చుతున్న నేపథ్యంలో కొత్తూరు గ్రామ పంచాయతీని మున్సిపల్‌గా మార్చేందుకు స్థానిక అధికారులు నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తాని అన్నారు. కొత్తూరు పరిసర గ్రామాలలో అధిక సంఖ్యలో నిరుపేద ప్రజలు నివసిస్తున్నారని మున్సిపాలిటీగా మార్చితే పన్నుల భారం పడుతుందని, ఆ భారాన్ని ప్రజలు మోయలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. కొత్తూరు గ్రామ పంచాయతీ పేరుకే పారిశ్రామికవాడ అయినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ తాలుకా స్థాయి నాయకులు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాదారం నర్సింహగౌడ్, లక్ష్మయ్యచారి, ఎంపీటీసీ అనురాధ కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సద్దాం, విష్ణుమూర్తి, ఎస్.నర్సింహ, యాదయ్య, వీరమోని వెంకటేష్, రామకృష్ణ పాల్గొన్నారు.

ఎన్‌ఐఆర్డీలో కేంద్ర మంత్రి పర్యటన
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 14: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషిచేస్తానని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి నరేంద్రసింగ్ తోమార్ స్పష్టం చేశారు. బుధవారం ఎన్‌ఐఆర్డీలోని సాంకేతిక విభాగాలను, మట్టిబాక్స్, వేపచమురు సంగ్రహణ, కేక్ మేకింగ్, హోంబెస్ట్ ప్రొడక్ట్స్, గిరిజన ఆభరణాలు, హనీబీకీపింగ్, సంచులు, లీఫ్ ప్లేట్‌మేకింగ్, హ్యాండ్‌మేడ్ కాగితం మార్పిడి, పుట్టగొడుగు సాగు, హైడ్రోఫోనిక్స్, సోలార్ ద్వారా ఆహార ప్రాసెసింగ్ డీ ఆర్థ్రీకరణ యూనిట్లు, టెక్నాలజీ యూనిట్ వంటి పలు అంశాలను పరిశీలించారు. ఎన్‌ఐడీడీ ఆర్‌ఆర్ డీజీ డాక్టర్ వైవీ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శక్తివేల్, ఎండీఖాన్, బీఎన్ మణి పాల్గొన్నారు.

వ్యవసాయంపై శే్వతపత్రం ఇవ్వాలి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 14: అసంబద్ద ఆరోపణలు చేస్తూ టీఆర్‌ఎస్ పబ్బం గడుపుకుంటోందని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏదీ లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. మీడియా కన్వీనర్ సుధాకర శర్మతో కలిసి బుధవారం పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులకు, చేసిన వ్యయానికి సంబంధించి శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి.. కేంద్ర ప్రభుత్వంపై బట్టకాల్చి వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏమిటో చెప్పకుండానే అన్నింటికీ కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయడం ఏమిటని నిలదీశారు. కేంద్రం చేయాల్సింది ఏమిటో బీజేపీ ప్రభుత్వం చేస్తూనే ఉందని, రాష్ట్రం చేయాల్సింది మాత్రం చేయడం లేదని అన్నారు. రైతాంగాన్ని ఆదుకోవల్సిన బాధ్యత వ్యవసాయ శాఖకు లేదా అని ప్రశ్నించారు. కందులు, జొన్నలు విషయంలో కేంద్రం వెనుకంజ వేస్తోందని మంత్రులు ఆరోపించడం దారుణమని, ఆకాశానికి హద్దు లేనట్టు, టీఆర్‌ఎస్ నేతల అబద్దాలకు పద్దు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు 2017-18 సంవత్సరంలో ఏమి చేశారు? బడ్జెట్ కేటాయింపులను ఏ విధంగా చేశారో ఎంత ఖర్చుచేశారో శే్వతపత్రం విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రం చేయాల్సిన పని ఏదీ చేయడం లేదని అన్నింటికీ కేంద్రాన్ని బదనాం చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ రైతుల్ని ఓటర్ల మాదిరి చూస్తున్నారని, రైతును అన్నదాతగా చూడటం లేదని ఆరోపించారు. హామీల మీద హామీలు ఇస్తూ ఆశలు ఎరవేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని అన్నారు. రైతుల జీవన ప్రమాణాలను పెంచే విధంగా కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారని చెప్పారు. మొత్తం మీద 24 శాతం అదనంగా కేటాయింపులు ఇచ్చారని గుర్తించరా అని ప్రశ్నించారు. కరవు ప్రభావంతో దేశంలో వ్యవసాయ సంక్షోభం ఉందని, గత ఏడాది వ్యవసాయంలో 2.1 శాతం మాత్రమే అభివృద్ధి సాధించడంతో ఈసారి మరింత అభివృద్ధికి వీలుగా కేటాయింపులు పెంచిందని అన్నారు.

రోడ్డు పనుల్లో నాణ్యత తప్పనిసరి
బాలానగర్ : ఫిబ్రవరి 14: రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కార్పొరేటర్ కాండూరి నరేంద్ర ఆచా ర్య అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని వినాయక్‌నగర్‌లో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాప చేశారు. కార్యక్రమంలో సర్కిల్ ఏఇ రషీద్, సీనియర్ నాయకులు మందడి సుధాకర్ రెడ్డి, నాగేందర్‌గౌడ్, శ్రీనివాస్‌ముది రాజ్, దేవేందర్ రెడ్డి, ప్రేమ్‌కుమార్, సుధ, సయ్యద్ అహ్మద్‌అలీ, సోఫీ పాల్గొన్నారు.
అనాథాశ్రమంలో అన్నదానం
మేడ్చల్, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి కేసీఆర్ 64వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మల్లికార్జున్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజు బుధవారం పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలోని కమ్యూనిటీ కేర్ అనాథ పిల్లల ఆశ్రమంలో సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్‌గౌడ్, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, రాజు, ప్రభాకర్, వెంకటేశ్, శారద, నీలిమ, బాబుగౌడ్, లక్ష్మణ్, సుబ్రమణ్యం, పరమేశ్, రజిత పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగ్ కేసులో నలుగురి అరెస్టు
ఉప్పల్, ఫిబ్రవరి 14: క్రికెట్ బెట్టింగ్ కేసులో నలుగురు వ్యక్తులను మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి వారి నుంచి రూ.62వేలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ సత్యనగర్ కాలనీకి చెందిన కే.శ్రీనివాస్ (23), విజయపురికాలనీలో నివసిస్తున్న కే.శ్రీ్ధర్ (21), పీ.సాయికుమార్ (27), బాలాజీహిల్స్‌లో నివసిస్తున్న ఆర్.సాయితేజ (23) మంగళవారం వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని ద్వారకానగర్‌లో న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో ఓ ఇంట్లో బెట్టింగ్ పెట్టి ఎంజాయ్ చేస్తుండగా అందిన సమాచారం మేరకు దాడి చేసి అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

సమస్యలు వదిలి ఆర్భాటాలు సరికాదు

ఎల్‌బీనగర్, ఫిబ్రవరి 14: వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలో సమస్యలు తాండవిస్తుంటే పట్టించుకునేవారు కరువయ్యారని రంగారెడ్డిజిల్లా టీడీపీ అధ్యక్షుడు సామరంగారెడ్డి ఆరోపించారు. ఆరు రోజులుగా డివిజన్‌లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేతల దృష్టికి వచ్చిన సమస్యలను బుధవారం రంగారెడ్డి సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌తో సమావేశమై సమస్యలను వివరించారు. డివిజన్ పరిధిలోని గుంటిజంగయ్యనగర్ కాలనీలో రోడ్డునెంబర్ 1లో 40 అడుగుల రోడ్డును పూర్తిగా చెత్తడంప్‌యార్డ్‌గా చేశారని అన్నారు. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసి అందులోని వ్యర్థాలు, చెత్తను అక్కడ వేశారని వివరించారు. దీంతో కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. 30 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లను అనధికార నిర్మాణమని అపరాద రుసుములతో ఇంటి పన్ను వసూళ్లు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మల్లికార్జునగర్ పైనుంచి వచ్చే డ్రైనేజీ నీరు కాలనీలోని చిన్న పైప్‌లైన్‌కు అనుసంధానం చేయడంతో మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నదని వాపోయారు. వనస్థలిపురం రెడ్‌వాటర్ ట్యాంక్ పక్కనగల పార్క్‌కు మూడు వైపుల రోడ్డు వేయడం మరిచారని గుర్తుచేశారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లోప్రచార ఆర్భాటాలు తప్ప అమలు ఎక్కడ కనిపించడం లేదని ఆరోపించారు. మోడల్ మార్కెట్ నిర్మాణం ప్రారంభించి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ పూర్తికాలేదని అన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సామ ప్రభాకర్‌రెడ్డి, నూతి శ్రీనివాసరావు, రవిశంకర్, రామేశ్వర్, మురళీధర్‌రెడ్డి, మెట్టు సంజీవ, రాములు, కృష్ణంరాజు పాల్గొన్నారు.