హైదరాబాద్

బల్దియాకు ‘స్వచ్ఛ’భయం ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: స్వచ్ఛ భారత్ సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలకు నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో ఈ సారి నెంబర్ వన్ ర్యాంకును సాధించుకునేందుకు జీహెచ్‌ఎంసీ అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
గత సంవత్సరం 22వ ర్యాంకును సాధించిన జీహెచ్‌ఎంసీ మెట్రో నగరాలతో పోల్చితే మెరుగైన ర్యాంకేనంటూ సమర్దించుకోంది. కనీసం ఈ ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లోనైనా నెంబర్ వన్ ర్యాంక్‌ను చేజిక్కించుకునేందుకు వీలుగా అన్ని నగరాల కన్నా కాస్త ముందుగానే స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతేగాక, ఇందులో ప్రజలను భాగస్వాములను చేసేందుకు అన్ని రకాల పోటీలు, నగర బహుమతులను కూడా ప్రకటించింది. అయినా సర్వేక్షణ్‌లో ఎలాంటి ర్యాంక్ వస్తుందోనన్న భయం జీహెచ్‌ఎంసీ అధికారులను వెంటాడుతోంది. నగరంలో స్వచ్ఛ కార్యక్రమాలు జరుగుతున్న తీరు, దానిపై ప్రజల్లో ఉన్న అవగాహన, గత సంవత్సరం కాన్న నగరంలో స్వచ్ఛత పరంగా పరిస్థితి మెరుగుపడిందా? ఎక్కడా కూడా బహిరంగ మల,మూత్ర విసర్జనలు జరగకుండా ఉందా? అన్న పలు అంశాలపై ఈ సర్వే జరగనుంది. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు ఈ సర్వే జరగాల్సి ఉండగా, 19కి వాయిదా పడినట్లు తెలిసింది. ఇందుకు గాను స్వచ్ఛ్భారత్ మిషన్ కార్వీ కన్సల్టెన్సీకి చెందిన మూడు బృందాలను నగరంలో అకస్మికంగా తనిఖీ కోసం నియమించింది. ఈ నెల 19న బృందాలు నగరంలో అప్పటికపుడు అకస్మికంగా తాము ఎంపిక చేసుకున్న నగరంలో పర్యటించి పారిశుద్ద్య, స్వచ్ఛ కార్యక్రమాలను తనిఖీ చేయనున్నాయి. దీంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్-2018 అనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది? అది మీకు తెలుసా?, మునుపటి కన్నా ఇపుడు స్వచ్ఛపరంగా నగరంలో పరిస్థితులు మెరగుపడ్డాయా? అన్న అంశంపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్‌ను సేకరించింది. అయితే ప్రజలు ఏ మాత్రం ప్రతికూలంగా జవాబు చెప్పినా, మార్కులో కొల్పోయే అవకాశమున్నందున, సర్కిళ్ల స్థాయి అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్న బాధ్యతను ఉన్నతాధికారులు కట్టబెట్టారు. తప్పకుండా ప్రజల నుంచి బృందాల ప్రశ్నకు సానుకూలంగా జవాబు వచ్చేలా కృషి చేయాలని ఖచ్చితమైన వౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. స్వచ్ఛ భారత్ మిషన్ బృందాలు సామాన్య పౌరులను కూడా కలిసి స్వచ్ఛ కార్యక్రమాలపై అభిప్రాయాలు సేకరించే అవకాశమున్నందున, అదే అంశం సర్వేలో కీలకంగా మారటంతో నగరంలోని ప్రతి ఒక్కరికి సర్వేక్షణ్‌పై చైతన్యం కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రతిరోజు ఎదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంది. ఈ క్రమంలో ఒక వేళ సర్వేలో మార్కులు తగ్గితే, సర్వే జరిగిన ప్రాంతంలో సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది.