హైదరాబాద్

సీపిఎస్‌ను రద్దు చేయాలని ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 22: సీపిఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించి, గ్రాట్యుటీ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) ఆధ్వర్యంలో గురువారం ఉప్పల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి డీఇఓ, డిప్యూటీ ఇఓ, ఎంఇఓ, జిహెచ్‌ఎం, ఎస్‌ఎ, అప్‌గ్రేడ్ చేసిన పండితుల, వ్యాయామ ఉపాధ్యాయులు, డైట్, జేఎల్ పోస్టులకు బదిలీలు చేపట్టి పదోన్నతులుకల్పించాలని పీఆర్‌టీయూ మండల కమిటీ అధ్యక్షుడు పూస అశోక్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు పిచ్చిరెడ్డి, సువర్ణ, రేవతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
మేడ్చల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర పీఆర్‌టీయూటీఎస్ పిలుపు మేరకు మేడ్చల్ మండలం సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని ఎంఆర్‌సీ భవనం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీ్ధర్ రెడ్డి, పుష్పలత, శ్రీనివాస్‌రావు, రాజశేఖర్‌రావు ఇంద్రకంటి జ్యోతి పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పీఆర్‌టీయూ టీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం తహాశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్షుడు ఆనంద్‌రావు, సంఘ నేతలు రాంరెడ్డి, అనిల్‌కుమార్, శ్రీలక్ష్మీ, మంజుల పాల్గొన్నారు.
షాద్‌నగర్: రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్ధు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు శ్రీ్ధర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఫరూఖ్‌నగర్ తహశీల్దార్ కార్యాలయం ముందు పీఆర్‌టీయూ ఆధ్వర్యలో ధర్నా నిర్వహించి తహశీల్దార్ రామారావుకు వినతిపత్రం అందజేశారు.
కేశంపేట: సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే రద్ధు చేసి పాత పద్ధతిలోనే పింఛన్ ఇచ్చేందుకు కృషి చేయాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.
శంషాబాద్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని శంషాబాద్ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట పీఆర్‌టీయూ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఎంపీపీ ఎల్లయ్య మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండలాధ్యక్షుడు బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్, రవీందర్ గౌడ్, బాల్‌రాజ్, లక్ష్మారెడ్డి, మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రమాదేవి పాల్గొన్నారు.
వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెటేటసిన సీపీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఈనెల 27న జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తగడి అంజిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో ధర్నాకు సంబంధించిన గోడ పత్రికను ప్రతినిధులు విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ప్యాట మల్లేశం, వివిధ మండలాల తపస్ నాయకులు మల్లేశం స్వామి, నరేందర్, నటరాజ్, రాజేందర్ రెడ్డి, రాఘవేందర్, రాంచందర్, పండరి, బాల్‌కిషన్, రాజ్‌కుమార్, పాండు, సంతోష్, కమాల్ రెడ్డి, శ్రీ్ధర్ రెడ్డి, రామకృష్ణ, రాజశేఖర్, ముత్యంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, దివాకర్ పాల్గొన్నారు.