హైదరాబాద్

అసైన్డ్ భూములకు కూడా పట్టాథారు పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: అసైన్డ్ భూములకు కూడా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర పట్టాదారులతో పాటు అసైన్డ్ భూముల పట్టాదారులకూ పాసు పుస్తకాలు అందజేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెవిన్యూ అధికారులను ఆదేశించారు. కొత్త పాసు పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్‌లో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సిసిఎల్‌సి కమిషనర్ రాజేశ్వర్ తివారి, భూ రికార్డుల ప్రక్షాళన ప్రత్యేక అధికారిణి వాకాటి కరుణ, సిఎంఓ ముఖ్య అధికారులతో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇతర పట్టాదారులతో పాటుగా అసైన్డ్ భూముల కలిగిన పట్టాదారులకు కూడా పాసు పుస్తకాలు అందజేయాలని రెవిన్యూ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియలో అసలు లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి వాటి యాజమాన్యంపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. పాసు పుస్తకాల ముద్రణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతీ ఎంట్రీని ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతనే ముద్రించాలని ఆదేశించారు. వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూమి కలిగి ఉన్నట్టు అయితే ఆ వివరాలను కూడా పాసు పుస్తకంలో నమోదు చేయాలన్నారు. దీని కోసం పాసు పుస్తకంలో అదనంగా మరో కాలమ్ పెట్టాలని సూచించారు. పాసు పుస్తకానికి ఆధార్ కార్డు నంబర్ తప్పని సరిగా అనుసంధానం చేయాలన్నారు. ఆధార్ కార్డు నంబర్‌తో అనుసంధానం చేయనీ భూములను బినామీ ఆస్తులుగా పరిగణించనున్నట్టు ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన విధంగానే మార్చి 11వ తేదీననే పంపిణీ చేయాలన్న గడువేమి లేదు, కొంత ఆలస్యమైనా పని పక్కగా జరిగాకే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గడువు దాటిపోతుందన్న తొందరపాటులో పొరపాట్లకు ఆస్కారం కల్పించవద్దన్నారు. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా ఉండాలని సిఎం సూచించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు. అనేక చిక్కులు ఎదురైనా క్లిష్టమైన పనిని రెవిన్యూశాఖ రేయింబవుళ్లు కష్టపడి విజయవంతం చేసారని ముఖ్యమంత్రి అభినందించారు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వివరాలను ‘్ధరణి’ వెబ్‌సైట్‌లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుంద్నారు. ధరణిలో నమోదు చేసిన వివరాల ఆధారంగానే కొత్త పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నట్టు సిఎం వెల్లడించారు. సొంత భూమి కలిగిన రైతులతో పాటు అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు కూడా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ కోసం కొంత వ్యవధి పట్టినా ఫర్వాలేదన్నారు. కలక్టర్లతో మాట్లాడి వివరాలను తెప్పించాలన్నారు. సూచించారు. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో కొందరు రైతులు తమ పట్టాదారు పుస్తకాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి నిరాకరిస్తున్నట్టు సమాచారం అందిందన్నారు. అలాంటి వారు ఇప్పటికైనా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి, లేనిపక్షంలో వాటిని బినామీ ఆస్తులుగా గుర్తిస్తామని సిఎం హెచ్చరించారు.

chitram...
కొత్త పాసు పుస్తకాల జారీపై ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్