హైదరాబాద్

రాంపల్లిలో ఊపందుకున్న ‘డబుల్’ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం శివార్లలోని రాంపల్లిలో ఊపందుకున్నయి. 41 ఎకరాల స్థలంలో పాఠశాల, బస్టాండ్, ఆట స్థలం, ఆసుపత్రి, షాపింగ్ సెంటర్, పార్కింగ్ వంటి తదితర ప్రత్యేకమైన వౌలిక సదుపాయాలతో 6వేల 264 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఘట్‌కేసర్ సమీపంలోని కీసరం మండలంలోని రాంపల్లి గ్రామంలో రూ.542 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణ పనులను స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రారామచంద్రన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ భారతి హోళికేరి శుక్రవారం తనిఖీ చేశారు. రామచంద్రాపురం మండలం కొల్లూరులో నిర్మిస్తున్న 15వేల 660 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు అతిపెద్ద ప్రాజెక్టు కాగా, అనంతరం రాంపల్లి గ్రామంలో 6వేల 264 ఇళ్లను నిర్మించటం మరో అతిపెద్ద ప్రాజెక్టుగా అధికారులు ఆమెకు వివరించారు. ఈ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్దారిత సంవత్సరంలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని చిత్రారామచంద్రన్ ఇంజనీర్లను ఆదేశించారు. రాంపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీకి 30 మీటర్ల విశాలమైన రోడ్డు నిర్మాణానికి లే అవుట్ చేయటం పట్ల అభినందించారు. బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి స్టీల్, సిమెంటు, ఇసుక తదితర ముడి పదార్థాల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వివరించారు. ఈ ఇళ్ల నిర్మాణ రంగంలో రాంపల్లి కాలనీ మోడల్ కాలనీగా రూపొందించే యోచనలో ఉన్నటుల్తెలిపిరు. ఈ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఇంజనీర్లు లక్ష్యాలను నిర్దారించుకోవాలని ఇవ వివరించారు. టనె్నల్ ఫాం విధానం ద్వారా ఈ స్లాబ్‌లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఒక్కో బ్లాక్ స్లాబ్ నిర్మాణానికి కేవలం 36 గంటలు మాత్రమే సమయం పడుతుందని, 12 నెలల్లోగా ఈ ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేసే అవకాశముందని అన్నారు. మొత్తం 52 బ్లాకులు నిర్మించాల్సి ఉండగా, 25 బ్లాకుల్లో ఎర్త్‌వర్క్ పురోగతిలో ఉండగా, మరో 15 బ్లాకుల్లో పుట్టింగ్‌లు, ఏడు బ్లాకుల్లో గోడల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు వివరించారు. మొత్తం 6వేల 264 డబుల్ బెడ్ రూం ళ్లను రూ. 495 కోట్ల వ్యయంతో చేపడుతున్నామని, వీటికి మరో రూ. 47 కోట్ల వ్యయాన్ని వౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ సందర్శనలో గృహానిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ సత్యమూర్తి, ఎస్‌ఈ రవీందర్, ఈఈ వెంకటదాసు తదితరులున్నారు.