హైదరాబాద్

హైదరాబాద్‌ నగరంలో బయోకాన్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాకరమైన జీనోమ్ వ్యాలీలో బయోకాన్ నూతన ఆర్ అండ్ డి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్ షా శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. బయో ఆసియా సదస్సులో భాగంగా రెండోరోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఫార్మా దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆమె బయోకాన్ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ అనుబంద కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా వెయ్యి హైస్కిల్స్ ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. దీంతో పాటు బయో కాన్ సిబ్బందిని రెట్టింపు చేసాస్తమని చెప్పారు. వీటికి సంబంధించిన వివరాలు త్వరలో అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫార్మా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. పారిశ్రామికవేత్తలకు మంత్రి కెటిఆర్ లాంటి నాయకులను చూస్తే స్ఫూర్తి వస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిరామారావు మాట్లాడుతూ ఫార్మాసిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకు ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు ఇస్తామన్నారు.
జీఈ సస్టయినబుల్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ అధ్యక్షుడు సిఇవో టెర్రీ బ్రెసెన్షమ్ మంత్రి కెటిఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడ్ డ్రైవైసెస్ పార్కు గురించి వివరించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ల్యాబోరేటరీలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన వౌలిక సదుపాయాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. వైద్య రంగంలో చేపట్టిన కాన్సర్ డయాగ్నస్టిక్స్ కార్యక్రమాలను ఆయన వివరించారు.
థాయిల్యాండ్ ఉప వాణిజ్య శాఖ మంత్రి చుటమా బున్యాప్రఫసారాతో మంత్రి కెటిఆర్ సమావేశమై తెలంగాణలో వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలను తెలుసుకున్నారు. భారతదేశంలో ఇటాలియన్ కాన్సలేట్ జనరల్ స్ట్ఫానియాకస్టాన్టాతో మంత్రి కెటిఆర్ సమావేశమై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానాలను వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చే ఇటాలియన్ కంపెనీలకు సహకరిస్తామని చెప్పారు. మంత్రితో మెర్క్‌లైఫ్ సైనె్సస్ సిఇవో ఉదిత్ భాత్రా, నోవార్టిస్, డెలాయిట్ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు.