హైదరాబాద్

ఆపరేషన్ ఛబుత్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: పాతబస్తీలో పని పాట లేకుండా రాత్రి సమయాల్లో వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న యువతపై దక్షిణ మండల పోలీసులు దృష్టిసారించారు. ఆపరేషన్ ఛబుత్రా పేరుతో శనివారం ఉదయం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు దక్షిణ మండలం పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో మూకుమ్మడిగా ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు మైనర్ల సహా 295 మంది యువతను పట్టుకున్నారు. వీరిందరికి దక్షిణ మండల పోలీస్ డిసిపి వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలాంటి ప్రయోజనం, పని లేకుండా రాత్రి సమయాల్లో వీధుల్లో సంచరించడం దేనికని వారికి క్లాస్ తీసుకున్నారు. వీరందరి తల్లిదండ్రులు, సంబంధీకులను పిలిపించి వారి సమక్షంలోనే ఈత్‌బార్ చౌక్‌లోని గుల్జార్ ఫంక్షన్ హాల్లో యువతకు కౌన్సిలింగ్ చేశారు. ఇలా పనీపాట లేకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత వీధుల్లో తిరగడం వల్ల చట్ట వ్యతిరేక పనులకు అలవాటు పడతారని, నేరాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుడతారని పోలీసులు వారికి వివరించారు. నేరాలకు అలవాటు పడకుండా, యువత పెడదారి పట్టకుండా చదువులపైనే దృష్టిసారించేందుకు వీలుగా ఈ ఆపరేషన్ ఛబుత్రా చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇంకా రాత్రి సమయాల్లో యువత చేపట్టే డేర్ డెవిల్ బైక్ స్టంట్స్ వంటి వాటిని నివారించడం, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు డిసిపి వివరించారు. అయితే సాధారణ ప్రజలకు ఎలాంటి అంతరాయం కలుగదని తెలిపారు. వీధుల్లో సంచరిస్తున్న యువతలో చాలా మంది తల్లిదండ్రులు గల్ఫ్ దేశాల్లో పని చేస్తూ అక్కడ సంపాదించిన దానిలో వీరి నిత్య ఖర్చుల కోసం కొంత పంపించడం, ఆ మొత్తంతో జులాయి తిరుగుళ్లు తిరుగుతూ నేరాలకు అలవాటు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి చెడ్డ అలవాట్ల నుంచి యువతను కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల జనవరి 1 నుంచి ఇప్పటి వరకు దక్షిణ మండలం పరిధిలో ఒక్క హత్య కూడా జరగలేదని, ప్రజలు అభివృద్ధి వైపు పయనిస్తూ, విద్య పట్ల ఆకర్షితులవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. గత నెలన్నర రోజులు దక్షిణ మండలం ప్రశాంతంగా ఉందని, పాత బస్తీ యువతలో మంచి మార్పు రావడం అభినందనీయమని డిసిపి కొనియాడారు.