హైదరాబాద్

గండిపేటకు వందనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: దేశంలోనే గండిపేట నీళ్లంటే మంచి పేరుంది. నిజాం హయాంలో నిర్మించిన ఈ జలాశయం నేటికీ ప్రతి వేసవి కాలంలో స్వల్పంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే నగరంలోని సగం జనాభా దాహార్తిని తీర్చుతుంది. 2020 నాటికి ఈ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి వందేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ, రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త్ధ్వార్యంలో మరిన్ని అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నాయ. గండిపేట వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ జలాశయం సుందరీకరణకు అంతర్జాతీయ స్థాయి డిజైన్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నగర వాసులు మొదలుకుని అంతర్జాతీయ స్థాయి సంస్థల సూచనలను తీసుకోన్నారు. మూసీ చుట్టూ ఏర్పాటు చేయనున్న ఎక్స్‌ప్రెస్ వేలు, ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణంపై మంత్రి అధికారులతో చర్చించారు. మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూసీ నదీ, సుందరీకరణ అంశంపై సాధాసాధ్యాలతో కూడిన అధ్యయన నివేదిక సిద్ధమైంది. సాగునీటి శాఖ చేపట్టే హైడ్రాలిక్ సర్వే కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఇప్పటికే మూసీ అభివృద్ధి కోసం అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తులు సమర్పించారు. మూసీ నదీ నీటిని శుద్ధి చేసే అంశంపై జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి, టీఎస్‌ఐఐసీ అధికారులతో ఓ జేఏసీ ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై వారం రోజుల్లో నివేదిక సిద్ధం కానుంది. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా మొట్టమొదటి సారిగా నదీలో నిరంతరంగా మంచినీరు ప్రవహించేలా చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చ జరుగుతోంది. ముందుగా జీహెచ్‌ఎంసీ, టూరిజం, సాగునీరు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు కలిసి కట్టుగా ఈ ప్రాజెక్ట్ కోసం కృషి చేస్తున్నారు.