హైదరాబాద్

గవర్నర్ వ్యవస్థకే కళంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: గవర్నర్ వ్యవస్థకే కలంకం తెచ్చేలా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కొనసాగిందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని మండిపడ్డారు. మూడు ఎకరాల భూమి నుంచి మొదలు, కేజీ టూ పీజీ, ఉద్యోగ నియామకాలు, రైతుల ఆత్మహత్యలు, మద్దతు ధర, రుణమాఫీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ఇలా ఏ అంశంపై సమగ్రంగా వివరణ లేదని అన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే ఏ ఒక్క అంశాన్ని ఇందులో పొందుపరచలేదని కిషన్ రెడ్డి అన్నారు. తప్పుడు విధానాలను నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసినట్టు చెప్పారు
పసలేని ప్రసంగం : ఆర్.కృష్ణయ్య
గవర్నర్ ప్రసంగంలో పసలేదని, నిర్ధిష్టమైన ప్రణాళికలు లేకుండా ప్రసంగం కొనసాగిందని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం నీళ్లు బంగాళఖాతం పాలు అవుతుండగా, నిధులు కాంట్రాక్టర్ల పాలవుతున్నాయని, నియామకలు ఆకాశం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్, బీసీ కార్పొరేషన్లకు నిధులు, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు, కల్యాణలక్ష్మి రూ.2లక్షల పెంపు వంటి ఏ ఒక్క అంశాన్ని పొందుపరచలేదని అన్నారు. పేదల గొంతునొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ధర్నాలకు అవకాశం లేకుండా చూస్తూ కేసీఆర్ ఢిల్లీలో మాత్రం ధర్నాలు చేస్తామనడం సిగ్గుచేటని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సంక్షేమ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధంగా ఉందని అన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికలకు లోబడి ప్రసంగం కొనసాగలేదని మండిపడ్డారు.
దాడిని ఖండించిన బీసీ సంక్షేమ సంఘం
మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఖండించింది. దాడి విషయం తెలుసుకున్న సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆసుపత్రికి వెళ్లి స్వామిగౌడ్‌ను పరామర్శించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించడం హర్షనీయమని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ యూనియన్‌లో రెండు వర్గాలు

హైదరాబాద్, మార్చి 12: జీహెచ్‌ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు పలు యూనియన్లలో చీలికలు తెస్తున్నాయి. ఈనెల 17వ తేదీన జరగనున్న ఎన్నికను పురస్కరించుకుని పోటీకి సిద్ధమవుతున్న మూడు ప్రధాన యూనియన్లు మినహా మిగిలిన ఇతర యూనియన్లలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై విభేధాలు తలెత్తుతున్నాయి. జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన కొందరు కార్మిక నేతలు బరిలో నిలిచిన మరో యూనియన్‌కు మద్దతును తెలపటంతో ఆ యూనియన్ రెండు వర్గాలుగా ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసొసియేషన్ కమిటీ కాలపరిమితి ముగిసి, ఇప్పటికే మూడేళ్లు పూర్తయినా ఇంకా కమిటీని ఎన్నుకోలేదని, తమ కమిటీకి చెందిన కొందరు స్వార్థపరులైన నేతలు బీఎంఈయుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసొసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శివాజీ, జాయింట్ సెక్రటరీలు ఎస్. అశోక్ కుమార్, అనిల్ కుమార్, ఎస్.ప్రేమానందం, డీ.శివకుమార్, ఎస్.శివకుమార్, పుష్ప, ఉమా, రాజ్‌కుమార్, శారద, జేకే నరేశ్, సీ.కృష్ణ వివరించారు. అధికారికంగా తమ అసోసియషన్‌కు కమిటీ లేకపోయినా, శనివారం కొందరు అసోసియేషన్‌కు చెందిన నేతలు కోరం లేకున్నా, సమావేశాన్ని నిర్వహించి బీఎంఈయుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వివరించారు.
కొందరు నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతూ, అసోసియేషన్ పేరు చెబుతూ ఈ రకమైన ప్రకటనలు చేయటంపై ఆదివారం రాష్ట్ర అసోసియేషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అసలు చట్టబద్ధంగా, సభ్యులచే ఎన్నుకోబడే కమిటే లేనపుడు, కొందరు నేతలు చేసిన ఈ ప్రకటనను రాష్ట్ర కమిటీ కూడా వ్యతిరేకించిందని, త్వరలోనే ఎన్నికలు జరిపి, తమ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గాన్ని నియమించే అంశంపై నాయకత్వం సానుకూలంగా స్పందించిందని వివరించారు.
దళిత అభ్యర్థికే మద్దతు
జీహెచ్‌ఎంసీ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఇతర అభ్యర్థులకు తాము మద్దతు ఇవ్వాలని భావిస్తే, బరిలో నిలిచే దళిత కార్మిక నేతకే మద్దతునిస్తామని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శివాజీ స్పష్టం చేశారు. యూనియన్ పేరు చెప్పుకుంటూ కొందరు నేతలు దళితయేతర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు చేసిన ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.