హైదరాబాద్

మహిళ ఫిర్యాదుకు స్పందించిన మంత్రి కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సామాజిక ప్రచార మాధ్యమాలను వినియోగించుకోవటంలో మన పాలకులు సైతం సత్తా చూపుతున్నారు. పేరుకు తగ్గట్టు మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సామాజిక ప్రచార మాధ్యమాలను వినియోగించటంలో ముందున్నారు.
చెందిన ఓ మహిళ చేసిన ట్విట్‌కు అప్పటికపుడే స్పందించిన మంత్రి గుర్రపుడెక్క పేరుకుపోయిన సరూర్‌నగర్ చెరువులో వెంటనే దోమల నివారణ మందును స్ప్రే చేయాలని ఆదేశిస్తూ జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి ట్వీట్ చేశారు.
సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతంలో నివసించే మానస అనే మహిళ తమ ప్రాంతంలో ఈ గుర్రపు డెక్క కారణంగా దోమల ప్రబలుతున్నాయంటూ మంత్రికి ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు స్పందించిన మంత్రి చెరువులో స్ప్రే చేయటంతోపాటు నగరంలో మరో ఇరవై చెరువుల్లో గుర్రపుడెక్క ఆకును తొలగించి పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయనున్నట్లు మహిళకు సమాధానమిచ్చారు.
పూర్తిస్థాయిలో చెరువులను అభివృద్ధి చేసేందుకు సమయం పడుతుందని, అప్పటివరకు సరూర్‌నగర్ చెరువులో దోమలు వృద్ధిచెందకుండా తాత్కాలికంగా స్ప్రే చేయించనున్నట్లు మంత్రి ఫిర్యాదు చేసిన మహిళకు వివరణ ఇచ్చారు.
మంత్రి ఆదేశాలతో ఉరుకులు, పరుగులు పెట్టిన జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు మంగళవారం ఈ చెరువుల్లో పెద్దఎత్తున పెరిత్రాన్ ద్రవాన్ని స్ప్రే చేసి, యాంటీ లార్వా, దోమల నివారణ చర్యలు చేపట్టారు. ఈ పనులను చీఫ్ ఎంటమాలజిస్టు వెంకటేశ్ నేరుగా పర్యవేక్షించారు.