హైదరాబాద్

కనీస మద్దతు ధరకు సత్యాగ్రహ ర్యాలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో దేశానికి వెన్నుముక లాంటి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సర్వాజ్ అభియాన్ కన్వీనర్ యోగేంద్రయాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ జేఎసీ చైర్మన్ కోదండరామ్‌తో కలసి ఆయన మాట్లాడారు. దశాబ్దాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తాము పండించే పంటలకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పాలకులకు రైతుల సమస్యలపట్ల ఉన్న నిర్లక్ష్యమే ఇందుకు కారణమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం, వ్యవసాయాన్ని బ్రతికించాలన్న ధ్యాస కూడా లేకపోవడంతో రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఉందని వారన్నారు. రైతులకు లాభసాటి ధరలు గ్యారంటీ చేయాలని, రైతాంగానికి శాశ్వత విముక్తి కల్పించాలన్న రెండు ముఖ్యమైన డిమాండ్‌లతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి రైతుల సంక్షేమం కోసం కాకుండా టీఆర్‌ఎస్ బూత్ కమిటీ నాయకుల కోసం ఏర్పాటు చేసినట్లుందని కోందడరామ్ ఎద్దేవా చేశారు. స్వరాజ్ అభియాన్, టిజెఏసీ, తెలంగాణ రైతు జేఏసీ, రైతు స్వరాజ్య వేదిక, జై కిసాన్ ఆందోళన్, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మొదటి దశగా మార్చి 14 నుండి 25 వరకు యాత్ర కొసాగుతుందని, 14న కర్ణాటక మార్కెట్ యార్డ్ సందర్శన,15న కర్నూల్ జిల్లా మార్కెట్ యార్డు సందర్శన, 16న సూర్యాపేట మార్కెట్ యార్డ్ సందర్శన, రైతుల సమస్యలపై సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గురజాల రవీందర్, అవినాష్, కనుగంటి రవి, కొండల్‌లు పాల్గొన్నారు.