హైదరాబాద్

పొట్ట కొడుతున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చేందుకు ప్రధాన కారకులైన వివిధ విభాగాల్లోని కార్మికులకు సకాలంలో జీతాలు అందటం లేదు. ప్రతి కార్మికుడికి ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని బల్దియా బిగ్ బాస్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తుంటే, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. బాధ్యతాయుతమైన కొందరు అధికారులే కమిషనర్ ఆదేశాలు బేఖాతరయ్యేందుకు కారకులవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని పార్కుల్లో హార్టికల్చర్ విభాగం కింద ఔట్ సోర్సు, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించటంలో కాంట్రాక్టర్లు మీన మేషాలు లెక్కిస్తున్నారు. వారికి అక్రమార్కులైన కొందరు అధికారులు కూడా తోడుకావటంతో కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నగరంలోని వివిధ పార్కుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని, ఎపుడు చెల్లిస్తారని ప్రశ్నిస్తే, తమకు ఇష్టమొచ్చినపుడు చెల్లిస్తామని, దిక్కున్నచోట చెప్పుకోమని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నట్లు కొందరు కార్మికులు వాపోయారు. పార్కుల్లో సెక్యూరిటీ, ఆఫీసు సబార్డినేట్ వంటి చిన్నాచితక ఉద్యోగాలు చేసుకునే కార్మికులకు నెలకు రూ.12వేల 500 జీతం చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై వారికి కేవలం రూ. 7500 నుంచి రూ.8వేల లోపు చెల్లిస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. అంతేగాక, ఈ కార్మికులకు ఏడాదికి సుమారు 15 క్యాజువెల్ లీవ్‌లు ఉండగా, వాటిని కూడా ఇవ్వకుండా, విధులకు గైర్హాజరైనపుడు జీతం కట్ చేస్తున్నట్లు పలువురు వాపోయారు. ఏడాదికి 15 రోజుల గైర్హాజరు, వారానికోసారి సెలవును మినహాయించిన తర్వాత కార్మికులు డుమ్మా కొడితే వేతనాల్లో కోత విధించాల్సిన సూపర్‌వైజర్లు ఆదివారాలు, సెలవులు, పండుగల రోజును కూడా లెక్కలేసి జీతాలను కట్ చేసి, తమకు కేవలం రూ.7వేల నుంచి రూ.8వేల లోపు చెల్లిస్తే, తామెలా బతకాలని కార్మికులు వాపోతున్నారు. డిసెంబర్ నెల నుంచి తమకు జీతాలు చెల్లించటం లేదని, ఎన్నిసార్లు అడిగినా, కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లు సంతృప్తికరమైన సమాధానం చెప్పటం లేదని వాపోతున్నారు. అంతేగాక, కొన్ని పార్కుల్లో కాంట్రాక్టుల గడువు త్వరలో ముగియనుందని, ప్రస్తుతమున్న కాంట్రాక్టరు తమ జీతాల బకాయిలను చెల్లించకుండా వెళ్లిపోతే తమ పరిస్థితి ఏమిటీ? అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కమిషనర్ స్పందించి తమకు ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.