హైదరాబాద్

నిజాం కాలాన్ని మరిపిస్తున్న నేటి సమాజం ‘గడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: రసరంజని ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు శుక్రవారం రవీంధ్రభారతిలో ప్రారంభమైనాయి. సంస్థ 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జెవి.సోమయాజులు స్మారక వేదికగా ‘గడి’ నాటికను ప్రదర్శించారు. నిజాం కాలంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. దొరలు ఆడపిల్లలను ఎత్తుకునిపోయి బలాత్కరించేవారు. ప్రస్తుత సమాజంలో కూడా కొంతమంది రాజకీయ నేతల కుమారులు విచ్చలవిడిగా అమ్మాయిలను అల్లరి చేయడం, మానభంగాలు చేయడం జరుగుతుంది. దీనికి పర్యవసానం ఏమిటి? ఈ అఘాయిత్యాలకు ముగింపు ఎప్పుడు అనేవిధంగా నాటిక సాగింది.
ఆకెళ్ల రచించిన ఈ నాటికకు బి.ఎం.రెడ్డి దర్శకత్వం వహించారు. ఎస్‌ఎన్‌ఎం రిక్రియేషన్ క్లబ్ (వరంగల్) సమర్పించిన ఈ నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
సందేశాత్మక నాటకాలు రావాలి
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బొల్లినేని కృష్ణయ్య మాట్లాడుతూ, తన చిన్నతనంలో నాటకం ప్రదర్శిస్తున్నారని తెలిస్తే చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రజలు వచ్చి నాటకాన్ని చూచేవారని అన్నారు. ప్రస్తుతం అనుకున్నంత ఆదరణ లేకపోయినా సందేశాత్మక నాటకాలతో ప్రేక్షకులను ఆడిటోరియంవరకు రప్పించేలా ప్రదర్శించాలని అన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత డిజిపి హెచ్.జె.దొర మాట్లాడుతూ, కళలకు కాకతీయుల కాలం నాటి ఆదరణ తిరిగి రావాలన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం.హరికృష్ణ మాట్లాడుతూ, చిన్నచిన్న కథలను నాటకాలుగా ప్రదర్శించాలన్నారు. మొదలి నాగభూషణ శర్మ మాట్లాడుతూ, నాటకాలకు స్ర్తి పాత్రలు దొరకడంలేదని అన్నారు. తొలుత రసరంచని కార్యదర్శి కామేశ్వరరావు స్వాగతం పలికారు.

ఎస్‌ఆర్‌డిపితో మారనున్న రూపురేఖలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 25: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) పనులు మరో అడుగు ముందుకు పడనున్నాయి. ఇప్పటికే ప్రతిపాదించిన ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాంతాల్లో లీ అసోసియేట్స్ అనే సంస్థ చేపట్టిన భూసార పరీక్షలు కూడా తుది దశకు చేరుకున్నాయి. మరో వైపు జిహెచ్‌ఎంసి స్థల సేకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. కానీ జూబ్లీహిల్స్ సిగ్నల్స్‌లోని మైండ్‌స్పేస్ వద్ద స్థల సేకరణ కొంత సమస్యగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తం నాలుగు దశలుగా పనె్నండు కారిడార్లను నిర్మించనున్నారు. ఇందులో మొదటి దశగా ఎంచుకున్న జూబ్లీహిల్స్ కెబిఆర్ పార్కు చుట్టు కారిడార్‌కు సంబంధించి జిహెచ్‌ఎంసి ఇప్పటికే స్థల సేకరణను వేగవంతం చేసింది. ఈ నాలుగు దశల పనుల్లో మొదటి మూడు దశల పనులు కొలిక్కి వస్తే నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. అంతేగాక, ప్రస్తుతం అరికిలోమీటరుకు ఒక్కటి, మరికొన్ని చోట్ల అరకిలోమీటరులో రెండు వరకున్న ట్రాఫిక్ సిగ్నల్స్ కనుమరుగైపోయి, ట్రాఫిక్ సమస్య లేని ప్రయాణం చేసేందుకు ఆస్కారమేర్పడుతోంది. నగరంలో నిత్యం రద్ధీగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి అడ్డంకుల్లేకుండా ట్రాఫిక్ సజావుగా ప్రయాణించేందుకు ఈ ప్లాన్ కింద ఐదు రకాల చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పాదచారుల భద్రతకు పెద్దపీట వేశారు. ముఖ్యగా స్కైవేలు ఏర్పాటు చేయటం, ప్రధాన రహదార్లలో ప్రత్యేకంగా కారిడార్లను ఏర్పాటు చేయటం, రోడ్డుపై ట్రాఫిక్‌ను వివిధ రకాల లేన్లలో అనుమతించేందుకు గ్రేడ్ సపరేటర్ చర్యలు చేపడటంతో పాటు ఫ్లైవోవర్లను నిర్మించే దిశగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. నిత్యం రద్ధీగా ఉండే జంక్షన్లలో పాదచారుల సౌకర్యార్థం తొలి దశగా ఏర్పాటు చేయనున్న 70 ఫుటోవర్ బ్రిడ్జిలపై అధ్యయనం తుది దశగా వచ్చినట్లు తెలిసింది. ఈ ప్లాన్ కింద రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో 12 పనులకు రూ. 1249 కోట్లను వెచ్చించనున్నారు. పనుల కింద ఇదివరకు రోడ్లను నిర్మించిన విధంగా కాకుండా ఒక రోడ్డును నిర్మించే ముందు ఆ రోడ్డులో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి రోడ్డు కట్టింగ్ పనులను పూర్తి చేసిన తర్వాతే రోడ్ల నిర్మాణ, ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఒకసారి రోడ్డు కట్టింగ్ పనులు పూర్తి చేసిన తర్వాత ఈ ప్లాన్ కింద గుర్తించి ప్రతిరోడ్డును వరద నీటి కాలువలు, డక్ట్, పూర్తి స్థాయి సైనేజీలతో రోడ్డును అభివృద్ధి పర్చాలని అధికారులు భావిస్తున్నారు.
అడ్డంకుల్లేని ప్రయాణం కోసమే
ప్రస్తుతం నగరంలో ఎక్కడబడితే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దర్శనమిస్తుంటాయి. కానీ ఈ ఎస్‌ఆర్‌డిపి ప్లాన్ కింద చేపట్టబోయే చర్యలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి అడ్డంకుల్లేకుండా ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించేందుకు ఆస్కారం కల్గించాలనుకు