క్రైమ్/లీగల్

ఘర్షణలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి16: జూబ్లీహిల్స్‌లో నలుగురు యువకుల మధ్య జరిగిన స్వల్ప వివాదం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోతీనగర్, హైమావతి నగర్‌కు చెదిన సుధీర్‌కుమార్ (23), కంకర చిప్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడు రమావత్ ధన్‌రాజ్ (23)తో కలిసి తన ద్విచక్రవాహనం (ఏపీ 09బీడబ్ల్యు) పై ఇందిరానగర్ ఎక్స్ రోడ్డులోని సాయి వైన్స్ సమీపంలో రాత్రి పూట శ్రీనగర్ కాలనీ వైపు వస్తుండగా, మరో ద్విచక్ర వాహనంపై అదే మార్గంలో అటుగా వెళుతున్న కృష్ణానగర్‌కు చెందిన సుషీల్ (20), వెంకటగిరి ప్రాంతానికి చెందిన షేక్ జమాల్ (25) వాహనాన్ని ఓవర్‌టెక్ చేస్తూ వెళుతుండటంతో ఇరువర్గాల మధ్య స్వల్ఫ ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణ సమయంలో ఇరువురు మద్యం సేవించి ఉన్నారు. సుషీల్‌కుమార్, జమాల్, సుధీర్ అతని స్నేహితుడు ధన్‌రాజ్‌పై బలంగా దాడి చేయడంతో సుధీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వైద్యపరీక్షల నిమిత్తం గాంధీకి తరలించారు.