హైదరాబాద్

కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 17: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజూ కొనసాగింది. జీవో నెం బర్ 14ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ము న్సిపల్ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో శనివారం విధులను బ హిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించా రు. బోడుప్పల్‌లోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఉప్పల్ బస్ డిపో, మేడిపల్లి, పర్వతాపూర్ మీదుగా పీర్జాదిగూడలోని ప్రధాన కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించి వంటా, వార్పుతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉద్ధృ తం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ కార్యదర్శి ఎన్. సృజన అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచి నిత్యం ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఎందుకు జీతాలు పెంచరని ప్రశ్నించారు. ధనిక రాష్టమ్రని చెప్పుకుంటున్న ప్రభుత్వం తక్కువ జీతాలతో దుర్భర జీవితాలను గడుపుతున్న కార్మికుల సంక్షేమం పట్టదా అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సీఐటీయూ నేతలు నిర్మల, మనోరంజన్ రెడ్డి, వీ.సుధ, మైసయ్య, సీపీఎం నేతలు జంగయ్య, సీపీఐ నేతలు బాల్‌రాజ్, మార్టిన్, మున్సిపల్ కార్మిక సం ఘం రాష్ట్ర కార్యదర్శి మైసగల్ల బాల్ నర్సింహ, నేతలు శ్రీరాములు, లక్ష్మ య్య, బాలమణి, లక్ష్మి పాల్గొన్నారు.
సమ్మెకు మద్దతు
న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య చైర్మన్ రాపోలు రాములు, కాంగ్రెస్ నేతలు పోగుల నర్సింహా రెడ్డి, టీ.జంగయ్య, బొమ్మక్ నర్సింగ్‌రావు, చీరాల నర్సింహ, బాల్‌రాజ్, యాదగిరి, కిషోర్, సీపీఐ నేతలు వి.బాల్‌రాజ్, మార్టిన్ సంపూర్ణ మద్ద తు ప్రకటించారు. ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

వంటావార్పు
ఇబ్రహీంపట్నం: సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ నగర పంచాయతీ కార్మికులు వంటావార్పుతో శనివారం తమ నిరసన తెలిపారు. మూడు రోజులుగా కనీస వేతనాన్ని అమలు చేసి, సమస్యలను పరిష్కరించాలని కార్మికులు దీక్షకు దిగారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో శనివారం స్థానికంగా వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి, రోడ్డుపైనే సహపంక్తి భోజనాలు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఈఎస్‌ఎన్ రెడ్డి, నాయకులు ఎల్లేష్, పద్మ, లక్ష్మయ్య, స్వప్న, రాజు, సుధాకర్, రవి పాల్గొన్నారు.
షాద్‌నగర్: వేతనాలు పెంచుతూ జారీ చేసిన జీవో ప్రకారం మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలని ఎఐటీయుసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు టీ.నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం షాద్‌నగర్ పురపాలక సం ఘం కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న ధర్నా మూడవ రోజుకు చేరుకుంది. సందర్భంగా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. 10వ పీఆర్‌సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న కార్మికులకు ఎలా వేతనాలు చెల్లిస్తున్నారో అదే తరహాల్లో నగర పంచాయతీ, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎఐటీయుసీ నాయకులు విఠల్ యాదవ్, ఎం.గోవింద్‌నాయక్, కిషన్, లక్యా, శ్రీను, ఎల్లయ్య పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయం ముందు..
మున్సిపల్ కార్మికులకు పెంచిన వేతనాల జీవో జారీ చేయకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.రాజు హెచ్చరించారు. శనివారం షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నా కు మద్దతు ఇవ్వడంతోపాటు మొకాళ్లపై నిరసన వ్యక్తం చేశా రు. ఎన్.రాజు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల్లో అత్యధికంగా దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని అన్నారు.
కార్మికు ల సంక్షేమానికి సీఐటీయూ ఎల్లప్పుడు అండగా ఉం టుందని అన్నారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులకు ఎలా వేతనాలు పెంచారో అదే తరహాలో మున్సిపల్ కార్మికులకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. సీఐటీ యూ నేతలు సాయిబాబా, చంద్రవౌ ళి, సాయిలు, శేఖర్, రవి, యాదయ్య, రాజు, వెంకటేష్, అంజమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ప్రశాంత్ పాల్గొన్నారు.