హైదరాబాద్

కుదింపు అంటూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: మహానగరంలో రూ.1200లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న ఇంటి యజమానులకు పన్నును రూ.101కు కుదిస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత సర్వే అంటూ పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలపై అదనపుపన్ను భారం మోపిందని టీడీపీ నగర అధ్యక్షుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు విమర్శించారు. శనివారం నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలే పన్ను కట్టలేని స్థితిలో ఉన్న వారిపై ప్రభుత్వం పెనాల్టీలు, వడ్డీ అంటూ, వడ్డీలకు వడ్డీ అంటూ అదనంగా వసూలు చేయటంపై ఆయన మండిపడ్డారు. వందల్లో చెల్లిస్తున్న యజమానులకు వేలల్లో, వేలల్లో చెల్లిస్తున్న వారికి లక్షల్లో పన్ను వడ్డించి ముక్కు పిండీ మరీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందిరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 5700 ఇళ్లను మాత్రమే నిర్మించిందని, వాటిలో కొన్ని ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని, మిగిలిన ఇళ్లను ఎపుడు పూర్తి చేస్తారోనని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలను నమ్మించేందుకు ప్రభుత్వంవ మళ్లీ ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనన్న భయం ప్రజల్లో ఉందన్నారు. ప్రభుత్వం ఏ ప్రకటన చేసినా, ఓట్ల కోసమే గానీ ప్రజల సంక్షేమానికి కాదని, ఇందుకు పన్ను కుదింపు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నిదర్శనాలుగా వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను, పలు విషయాల్లో అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము నిర్వహిస్తున్న ‘బస్తీబస్తీకి తెలుగుదేశం’ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి చక్కటి ఆదరణ వస్తోందని వివరించారు. ఏ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించినా, ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు ఎంఎన్ తెలిపారు. సమావేశంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు షకీలారెడ్డి, నేతలు వనం రమేశ్, బద్రినాధ్ యాదవ్ పాల్గొన్నారు.