హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో ‘ఉగాది’ పర్వదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 18: తెలుగు సంవత్సరం ‘ఉగాది’ పర్వదిన వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రాలతోపాటు వివిధ గ్రామాల్లో ప్రజలు ఉగాది పర్వదిన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. తెల్లవారుఝాము నుంచి ఇంటితోపాటు ఇంటి పరిసరాలను శుభ్రం చేసి నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ పంచాయతీ శివారులో ఉన్న శ్రీ్భవానీమాత దేవాలయం, రాయికల్ గ్రామ శివారులో ఉన్న ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయం, పట్టణంలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయం, కన్యకాపరమేశ్వరీ దేవాలయం, శ్రీరామ సత్యనారాయణ స్వామి దేవాలయం, చౌడమ్మగుడ్డ ఆంజనేయస్వామి దేవాలయం, నందిగామ మండలంలోని శ్రీసీతారామచంద్ర దేవాలయం, కొందుర్గులో శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా ఇళ్లల్లో చెక్కర, బెల్లం, మామిడి, వేపపూత, కొబ్బరి, గసాలు, పుట్నాలు, చింతపండుతో తయారు చేసిన పచ్చడిని అస్వాదించారు. దాంతో ఉగాది పర్వదిన వేడుకలు కన్నుల పండువగా భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆయా దేవాలయాల్లో గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నూతన పంచాంగ శ్రావణాన్ని పూజారులు చదివి వినిపించారు. పనె్నండు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం ఎలా ఉన్నాయనే విషయాలను స్థానిక పూజారులను ప్రజలు అడిగి తెలుసుకున్నారు.
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి పట్టణంలో ఆదివారం ఉగాది పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. ఉదయానే్న మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి, వేపాకు తోరణాలు కట్టారు. షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని ఒకరికొకరు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక వాసవి క్లబ్ సభ్యులు ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహారాష్టక్రు చెందిన ప్రజలు గుడిపడవ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. ఇళ్ల ముందు చీర, రవికతో అలంకరిచిచిన ధ్వజ స్థంభాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులు కొత్త దుస్తులు ధరించి చుట్టు పక్కల ఉన్న బంధువులకు పచ్చడిని పంచిపెట్టారు.
చేవెళ్ల: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సర్వదినాన్ని ఆదివారం చేవెళ్ల పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఊరువాడా విలంబినామ సంవత్సరానికి స్వాగతం ఫలికారు. విలంబినామ సంవత్సరంలో తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఇళ్ల ముంగిళ్లకు వచ్చిన మామిడి తోరణాలు, వేప పూతను గుమ్మాలకు తగిలించి దేవతామూర్తులకు పూజలు చేపట్టారు.ప్రతి ఇంటా ఉదయమే నూతనంగా కొనుగోలు చేసిన మట్టి కుండల్లో షడ్రుచులతో కూడిన పచ్చడి తయారు చేయడంతో పాటు అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా పూర్ణంతో కూడిన బెల్లం, చెక్కల భక్షాలను చేసి కుటుంబ సభ్యులంతా కలిసి ఆరగించారు. నూతన తెలుగు సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆక్షాంక్షిస్తూ అన్నదాతలు ఖరీప్ పంటల సాగుకోసం పొలాల దుక్కులు ప్రారంభించారు. పండుగ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో ఉన్న కుటుంబ సభ్యులు గ్రామాలకు తరలి రావడంతో ఏ ఇంట చూసిన జనం సందడి కన్పించింది. సాయంత్రం గ్రామంలోని హన్‌మాన్ దేవాయాల్లో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ రాశిఫలాలు, జాతకాలను చూయించుకున్నారు.
నార్సింగి: తెలుగు నూతన సంవత్సరం పండుగ పురస్కారించుకుని ఉగాది పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలలోని వివిధ దేవాలయాలలు భక్తులతో కిటకిటలాడాయి. పలు దేవాలయాలను కూడా అందంగా వివిధ రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు. ఆదివారం ఉదయం ఉగాది పండుగ పురస్కారించుకుని ప్రజలు తమ ఇళ్లలకు మామిడి తోరణాలతో స్వాగతం పలికారు. వివిధ అభిరుచులు కలిగిన ఉగాది పచ్చడి తయ్యారు చేసి, కుటుంబ సభ్యులందరు కలిసి తాగారు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా అంతా మంచిగా జరుగాలని ఉగాది పచ్చడిని అందజేశారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ పురస్కారించుకుని ప్రజలు కొత్త వస్త్రాలు కూడా ధరించారు. సాయంత్రం వివిధ దేవాలయాలలో పంచాంగా శ్రావణం కూడా జరిగింది. జాతక చక్రాలను వేద పండితుల వద్ద ప్రజలు అడిగి తెలుసుకున్నారు. వివిధ దేవాలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంతో పాటు పచ్చడిని కూడా అందజేశారు. రోడ్లుపై ఉదయమే మామిడి ఆకులు, మామిడి కాయలు, వేప కొమ్మలకు ఉన్న పూవ్వులతో, వివిధ రకాల పూలు, పచ్చడి తయారు చేసే అన్ని సైజుల కుండలు అమ్మారు.
రాజేంద్రనగర్: ఉగాది వేడుకలను డివిజన్‌లో ప్రజలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ శుభాకాంక్షలను తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ నేత శ్రీశైలం రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గూడూరి శ్రీనివాస్ రెడ్డి, తలారి చిన్న, శ్రీకాంత్ రెడ్డి, శ్రీను, ప్రతాప్ రెడ్డి, చిరంజీవి, మల్లారెడ్డి పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, దేవేందర్ గౌడ్‌ను రాజేంద్రనగర్ నాయకులు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మ్యాడం రామేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
కేశంపేట: శ్రీవిలంబనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రావణంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఆదివారం కేశంపేట మండల పరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట దేవాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రావణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2018-2019లో వర్షాలు ఎక్కువగా కురుస్థాయా..లేదో.. పంటలు ఎలా పండుతాయనే విషయాలను పూజారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసి పంటలు బాగా పండాలని భగవంతుడిని కోరుకున్నట్లు అంజయ్య యాదవ్ వివరించారు. కార్యక్రమంలో ఎక్లాస్‌ఖాన్‌పేట సర్పంచ్ రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.

బీజేపీ శ్రేణుల సందడి
ఉప్పల్, మార్చి 18: ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ జన్మదిన వేడుకలు రామంతాపూర్ నెహ్రూనగర్‌లోని ఆయన ఇంట్లో ఆదివారం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరిగాయి.
నియోజకవర్గంలోని కాప్రా, ఉప్పల్ సర్కిల్ నుంచి వందలాది మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి కేక్ కట్‌చేసి అనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఉగాది పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న తనపై ప్రజల ఆధరాభిమానాలు చూపడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఛలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ
షాద్‌నగర్ టౌన్, మార్చి 18: తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఛలో ఢిల్లీ కరపత్రాన్ని ఆదివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీఎంఆర్‌పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి సింగపాగ జంగయ్య ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
జంగయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ, మాదిగ ఉపకులాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మార్చి 20,21,22వ తేదిల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా, నిరసన నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎంఆర్‌పీఎస్ తాలుకా అధ్యక్షుడు జాంగారి రవి, శివ, మనోహార్, విజయ్, వరప్రసాద్, నర్సింహ పాల్గొన్నారు.

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామి
కొడంగల్, మార్చి 18: పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీమహాలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో హోమ కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారు కల్పవృక్ష వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయంలో దరూరీ శ్రీనివాస చారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవాణాన్ని చదివి వినిపించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో నిమగ్నమై స్వామివారిని దర్శించుకున్నారు.