హైదరాబాద్

అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మార్చి 18: ప్రతి విద్యార్ధి అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల పరిధిలో వెంకటాపూర్‌లోని సీవీఏస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. నిర్వహించిన సినర్జీ-2కే18 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్ధికి నాణ్యత కలిగిన విద్యనందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. చదువులు పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పార్కులు, సాఫ్ట్‌వేర్ సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచంలోని ఆర్ధికంగా ముందున్న దేశాలతో పాటు పారిశ్రామిక వేత్తలను అహ్వానిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి కళాశాల యజమాన్యాలు అన్ని రకాల వౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యతో పాటు సామాజిక, వర్తమాన అంశాలపై అవగాహన కల్గించాలని, తమకు నచ్చిన రంగంలో ప్రావీణ్యతను పెంచుకోవాలన్నారు. సాఫ్ట్‌వేర్, ఫార్మసీ, ఎలాక్ట్రానిక్స్ రంగాలలో చాలా అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యత ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. వివిధ అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని, విద్యార్ధులకు జ్ఞాపీకలు, ప్రశంసా పత్రాలు ఎంపీ కవిత అందజేశారు. విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భారత అథ్లెటిక్ కోచ్ ద్రోణాచార్య ఎస్.రమేశ్, సీనీ గేయ రచయిత అనంత శ్రీరామ్, యువ గాయని రమ్యబెహ్ర, కార్యదర్శి నీలిమ, డైరక్టర్ కేఏస్ రావు, డీప్యూటీ డైరక్టర్ విష్ణుమూర్తి, డీన్ ముత్తారెడ్డి, ఫార్మసీ డీన్ ముకుందా వాణీ పాల్గొన్నారు.