హైదరాబాద్

‘మహా’లక్ష్యం 13రోజులు.. రూ.300 కోట్లు క్షేత్ర స్థాయి సిబ్బందికి వసూళ్ల టార్గెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను కలెక్షన్‌పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సారి ఒకవైపు స్వచ్ఛ సర్వేక్షణ్ 2018పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తునే అందుకు సమాంతరంగా వసూళ్లను కూడా పర్యవేక్షిస్తున్నారు.
కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి ఆస్తిపన్ను వసూళ్లు కోట్లలో పెరుగుతున్నా, ఈసారి కలెక్షన్ అధికారులకు సవాలుగా మరింది. ఒకవైపు ఎస్‌ఆర్‌డీపీ, డబుల్ బెడ్‌రూం వంటి భారీ ప్రాజెక్టులు చేపడుతున్నందున మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని కొంతమేరకైనా అధిగమించేందుకు ఆస్తిపన్ను కలెక్షన్ తప్పనిసరైపోయింది. గత ఆర్థిక సంవత్సరం రూ.1100 కోట్ల ఆస్తిపన్నును వసూలు చేసుకున్న బల్దియా అధికారులు ఈసారి రూ.1400 కోట్ల కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ.1100 కోట్ల వరకు వసూలు చేసిన అధికారులు, వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నందున, లక్ష్యం ప్రకారం మరో రూ.300 కోట్లను వసూలు చేయాల్సిందేననంటూ క్షేత్ర స్థాయి సిబ్బందికి టార్గెట్లు విధించారు. వసూళ్లపై ఎప్పటికపుడు ఉన్నతాధికారులు.. సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లు, వ్యాలుయేషన్ ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహించి, కలెక్షన్ మెరుగుపరిచేందుకు, మొండి బకాయిలను రాబట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధికారులు నిర్దేశించుకున్న టార్గెట్ ప్రకారం ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరం చేసిన కలెక్షన్‌తో సమానంగా ఆస్తిపన్ను వసూలైనా, రానున్న 13 రోజుల్లో మరో వంద కోట్ల మేరకైనా వసూలు చేసుకుంటే, టార్గెట్ ప్రకారం కాకపోయినా గత సంవత్సరం కంటే దాదాపు వంద కోట్ల రూపాయలను అదనంగా వసూలవుతుందని అధికారులు భావిస్తున్నారు.
పన్ను పెంచకుండానే పెరిగిన కలెక్షన్.. కలిసొచ్చిన ‘కుదింపు’ నిర్ణయం
నగరంలో రూ.1200లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న ఇంటి యజమానుల పన్నును రూ.101 కుదిస్తున్నట్లు గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బల్దియాకు కలిసొచ్చింది. ఆస్తిపన్ను పైసా పెంచకుండానే నిర్ణీత టార్గెట్ ప్రకారం కలెక్షన్‌ను పెంచుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో తోడ్పడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పన్ను కుదింపు అర్హులను గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సునానీ సర్వేతో ల్యాండ్, బిల్డింగ్ యూసేజ్, మొత్తం ఏరియా వంటి తదితర అంశాల ప్రాతిపదికన ఇంటి యజమానులే బల్దియాకు రూ.1200కన్నా రెండు, మూడింతలు చెల్లించాల్సి వస్తోంది. పరిణామంతో పేద, మధ్య తరగతికి చెందిన ఇంటి యజమానులపై మోయలేని భారం పడుతుందని వాపోతుండగా, రాజకీయ నేతల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నగరానికి ఉగాది శోభ
హైదరాబాద్, మార్చి 18: మహానగరానికి ఉగాది శోభ నెలకొంది. తెలుగు నూతన సంవత్సరానికి ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం నగరంలోని పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పాతబస్తీలోని చారిత్రక దేవాలయమైన శ్రీ్భగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ దేవాలయం, బల్కంపేట శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంతో పాటు బిర్లా మందిర్, సికిందరాబాద్ గణపతి దేవాలయంతో పాటు దాదాపు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. పాతబస్తీ శ్రీ్భగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఆవరణలో దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ప్రతి ఇంట్లో షడ్రుచుల పచ్చడి రుచి చూశారు. తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆంకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పూజాసామాగ్రి, పూలు, పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి.