హైదరాబాద్

కళలను ఆదరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు సంగీత, సాహిత్య కళలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు నాయ్యమూర్తి జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ అన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణణ్‌కు ‘ఎస్. రాజేశ్వర రావు’ పురస్కారం, ప్రముఖ గాయనీ ఆకునూరి శారదకు ‘ఆరుద్ర’ పురస్కార ప్రదానోత్సవం ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి జిస్టిస్ అమర్‌నాథ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో అదనపు రిజిస్ట్రారు డా. ఎన్.కిరణ్మయి, బీజేపీ నాయకురాలు గీతామూర్తి, వైకే నాగేశ్వర రావు, దుర్గాయాదవ్, సంస్థ అధ్యక్షుడు డా.కే.సత్యనారాయణ గౌడ్, వెంకట్ రెడ్డి, ఓంప్రకాశ్ పాల్గొన్నారు.

దివ్యాంగులకు ఉగాది పురస్కారాలు
కాచిగూడ, మార్చి 19: ఉగాది పండుగను పురస్కరించుకుని దివ్యాంగులకు వేగేశ్న - ఉగాది’ పురస్కారాల ప్రదానోత్సవం వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని దివ్యాంగులకు వేగేశ్న ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. అంగవైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని పేర్కొన్నారు. అంగవైకల్యంతో కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. సభకు ముందు దివ్యాంగులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రజానటి జమునా రమణారావు, లయన్ విజయ్ కుమార్, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, ఎంవీ రాఘవాచార్య, డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.