హైదరాబాద్

మర్యాద..మర్యాద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి: విజిబుల్ పోలీసింగ్ పెరిగిప్పుడే నేరాలు అదుపులో ఉంటాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎస్‌ఓటి, సీసీఎస్, పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలతో కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లల కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఎస్‌ఓటి, సీసీఎస్ పోలీసులు స్థానిక పోలీసులతో కలసి పని చేయాలని చెప్పారు. ఉత్తమ పనితీరు కనబర్చే పోలీసులకు రివార్డులు అందిస్తానని, బాదితుల పట్ల నిర్లలక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ట్యాబుల్లో వచ్చే కేసులను వేగంగా నమోదు చేయాలని చెప్పిన సీపీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తరచూ పర్యటించాలని పేర్కొన్నారు. పండుల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేసుల వివరాలను సీసీటిఎన్‌ఎస్ (కైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్) లో నమోదు చేయాలని అన్నారు. సైబరాబాద్ పోలీసుల పనితీరు చాల భాగుందని ఇటీవల జరిగిన హెచ్‌సీయూ సంఘటన, ఆర్జిఐఏ పీస్ పరిధిలో తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకోవడం, శామీర్ పేట సంఘటనలపై పోలీసుల పనితీరును అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, క్రైం డీసీపీ జానకీ షర్మిలా, ఏడీసీపీలు భద్రేశ్వర్, నతానియేల్, ఏసీపీ నరసింహా రెడ్డి పాల్గొన్నారు. పోలీసు స్టేషన్‌లో ఆయా విభాగల ఎస్‌హెచ్‌ఓలకు సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. డ్యూటీలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు రివార్డులు అందించారు.