రంగారెడ్డి

ముగ్గురూ..ముగ్గురే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూకట్‌పల్లిలో వివేక్‌తో జతకట్టిన ఎమ్మెల్యేలు గాంధీ, కృష్ణారావు
వారు.. ముగ్గురు .. ఇరుగు పొరుగు
నియోజక వర్గ ఎమ్మెల్యేలు..
సామాన్య ప్రయాణికుల కష్టాలు
తెలుసుకునేందుకు అసెంబ్లీకి ఆర్టీసీ
బస్సులో ప్రయాణించారు.
జీడిమెట్ల, మార్చి 20: ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నగర వాసులు కృషిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి నుంచి నిజాంపేట్, కూకట్‌పల్లి మీదుగా అసెంబ్లీకి ఎమ్మెల్యే వివేక్ ఆర్టీసీ బస్సులో రెండో రోజైన మంగళవారమూ వెళ్లారు. కూకట్‌పల్లిలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వివేక్‌తో జతకట్టారు. వివేక్‌తో కలిసి అసెంబ్లీ వరకు గాంధీ, కృష్ణారావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ పై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ఆర్టీసీ బస్సులో సమస్యలు, ట్రాన్స్‌పోర్ట్, ట్రాఫిక్ సమస్యల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. వివేక్ మాట్లాడుతూట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు అలవాటుపడాలని కోరారు. రద్దీ సమయంలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ సమస్యతో ప్రయాణం ఆలస్యం అవుతుందని చెప్పారు. మహిళలకు కొన్ని బస్సులు ప్రత్యేకంగా వేస్తే బాగుంటుందన్నారు. సామాన్యుల కష్టాలు తెలుసుకుంటున్న ముగ్గురూ ముగ్గురే అని ఎమ్మెల్యేలను ప్రయాణికులు ప్రశంసించారు.