హైదరాబాద్

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: సర్కారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను యువత సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బుధవారం నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వృత్తి నైపుణ్యత శిక్షణపై మైనారిటీ, ఎస్సీ, యువతకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించారని, దేశంలోనే ఇది అత్యధికమని వివరించారు. జిల్లా కలెక్టర్ చొరవపైనే బలహీనవర్గాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని అన్నారు. విద్యా ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతోందన్న సంకల్పంతో గురుకులాలను ప్రభుత్వం నెలకొల్పిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల ప్రవేశాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, మైనారిటీ గురుకులాలకు ఆశించిన స్థాయిలో ప్రవేశాలు జరగటం లేదని విచారం వ్యక్తం చేశారు. మైనారిటీల్లోనూ మార్పు వచ్చిందని, పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ది పొందాలని సూచించారు. ఆర్థికంగా ఎదిగేందుకు నైపుణ్య శిక్షణ ఉపయోగపడుతోందని వివరించారు. ప్లేస్‌మెంట్ గ్యారంటీతో ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు టాటా, ఆదిత్య బిర్లా, ఎయిర్‌వేస్, హాస్పిటాలిటీ, టూరిజం, ఈసీఐఎల్, సెట్విన్ లాంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని, వేలాది మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బ్యాంకర్లతో మాట్లాడి రూ.5లక్షల సబ్సిడీతో యూనిట్లు మంజూరీ ఇస్తున్నట్లు తెలిపారు. మైనారిటీ యువత రిపేరింగ్ షెడ్లు మైకానిక్‌లుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వారికున్న పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, మరికొద్ది మందికి ఉపాధి చూపుతారని అన్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ జిల్లాలో ఇటువంటి శిక్షణలు ఎక్కువగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ డా.యోగితా రాణా మాట్లాడుతూ మైనారిటీ యువతకు వృత్తి, నైపుణ్య, ప్లేస్‌మెంట్ గ్యారెంటీ శిక్షణకు ప్రభుత్వం రూ. 2కోట్లు నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి విడతగా ఇస్తున్న శిక్షణకు మైనారిటీ వర్గాల నుంచి 406 మంది యువత ముందుకొచ్చినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 768 మందికి వృత్తి నైపుణ్య శిక్షణకు రూ. 13 కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఎస్సీ కులాల నుంచి శిక్షణకు 101 మందిది ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈసీఐఎల్, ఆలీవ్, సెట్విన్, ఏస్ సంస్థలతో పాటు పాలిటెక్నిక్ కాలేజీ వృత్తి నైపుణ్య శిక్షణకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలన్నదే ఈ శిక్షణ ముఖ్య ఉద్ధేశ్యమని వివరించారు. ప్రతి అభ్యర్థి ఆరు నెలల పాటు శిక్షణకు రెగ్యులర్‌గా హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ శ్రీవత్సకోట, ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ హన్మంత్ నాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఖాసిమ్, ఆర్డీఓ చంద్రకళ, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ మైత్రిప్రియ పాల్గొన్నారు.

చెక్కు బౌన్స్‌లకు ‘చెక్’
* బల్దియా సరికొత్త విధానం
హైదరాబాద్, మార్చి 21: జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను చెల్లింపుల తాలూకు అందజేసే చెక్కులు బౌన్స్ కాకుండా అధికారులు సరికొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి మార్చి నెలాఖరులో బకాయిదారులు కొందరు బౌన్స్ అవుతున్న చెక్కులతో చెల్లించి తమ పనైపోయిందనుకుని చేతులు దులుపుకుంటున్నారని, ఇది బల్దియా అధికారులకు తలభారంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు స్వీకరించిన చెక్కు పూర్తిగా నగదుగా మారిన తర్వాతే జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను డేటాలో అప్‌లోడ్ బేస్‌లో క్లియర్ చేసినట్లు వచ్చే విధంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో ఏ మాత్రం తగ్గకుండా, వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా ఈ సరికొత్త మార్గం దోహదపడుతుందిన అధికారులు భావిస్తున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కేవలం తొమ్మిదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అధికారులు కలెక్షన్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ఈ చివరి రోజుల్లో వచ్చిన చెక్కులు ఎక్కువగా బౌన్ అవుతున్నట్లు గుర్తించిన అధికారులు చెక్కును తీసుకునే ముందే పూర్తి స్తాయిలో స్క్రూటినీ చేయాలని నిర్ణయించారు. అందిన చెక్కు బ్యాంక్‌లో డబ్బులు జమ అయిన తర్వాతే బకాయిలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ డేటాబేస్‌లో ఆస్తిపన్ను చెల్లించినట్లు సమాచారం అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ అంతర్గత ఆర్థిక విభాగంతో చెక్కు క్లియర్ అయిన విషయాన్ని జీహెచ్‌ఎంసీ సర్వర్‌ను నిర్వాహణ బాధ్యతలు చేపట్టిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి పంపించి, అక్కడ బకాయిలు క్లియర్ అని పేర్కొనేలా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సరికొత్త విధానంతో చెక్కు బౌన్స్‌లను పూర్తిగా నివారించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేస్తే బల్దియాకు చెక్కు బౌన్స్‌ల బెడద పూర్తిగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.