హైదరాబాద్

గడువులోపు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటూ, ఇంకా బల్క్ ప్యాకేజీ కింద, బోర్ వెల్ నీటినే సేవించి కాలం గడుపుతున్న ఔటర్ గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు జలమండలి చేపట్టిన ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశముంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామాలకు నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేసిన జలమండలి ఈ నెలాఖరు 31 తర్వాత మరో 22 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందుకుగాను శుక్రవారం మహేశ్వరం మండలం సర్దార్‌నగర్ గ్రామంలో పైప్‌లైను పనులు పూర్తికావటంతో ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ ప్రక్రియను జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ డి.శ్రీ్ధర్‌బాబు, పీసీసీ-3 సీజీఎం పి. వెంకటేశ్వర్‌రావు, పీడీ-1 జీఎం టీ.వీ.శ్రీ్ధర్ నేరుగా పరిశీలించారు. 22 గ్రామాల్లో పైప్‌లైన్, రిజర్వాయర్ పనులు పూర్తిచేసి, నల్లాల ద్వారా నీటిని అందించనుంది. మిగిలిన గ్రామాల్లో పైప్‌లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు కూడా సకాలంలో పూర్తిచేసేలా అధికారులు ఎప్పటికపుడు క్షేత్రస్థాయి తనిఖీలు, పర్యటనలు, ప్రధాన కార్యాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పనుల్లో రైల్వే క్రాసింగ్, ఆర్ అండ్ బి రహదారి, జాతీయ రహదారి క్రాసింగ్‌ల వద్ద కొన్ని క్లిష్టమైన గ్యాపుల పనులు ఉన్నాయి. రైల్వే క్రాసింగ్‌ల వద్ద పైప్‌లైన్ పనులు చేపట్టేందుకు అనుమతుల కోసం జలమండలి ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖను సంప్రదించింది. రెండు, మూడురోజుల్లో ఇందుకు సంబంధించిన అనుమతులు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీప రహదారిని టనె్నలింగ్ ద్వారా దాటే పనులను కూడా చేపట్టేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.

చేనేత కార్మికులకు చేయూత
ఖైరతాబాద్, మార్చి 23: ప్రాచీన కాలం నుండి వస్తున్న చేనేత కార్మికులు అంతరించి పోకుండా, చేనేత పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులను బ్రతికించుకోవాలని, టెక్స్‌టైల్స్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాగూర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో చేనేత కార్మికులతో కలిసి మాట్లాడుతూ, వచ్చే నెల పోచంపల్లిలో ప్రారంభించబోయే టెక్స్‌టైల్స్‌లో వచ్చే లాభాలు హ్యాండ్లూమ్ కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా పోచంపల్లికి చెందిన 12 కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ పత్రాలు సమర్పించారు. మంత్రి కేటీఆర్ ప్రతి ఉద్యోగి సోమవారం హ్యాండ్లూమ్ దుస్తులు ధరించాలని ప్రకటించిన విషయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆమె తండ్రి భరత్ రష్మి, పోచంపల్లి గ్రామ హ్యాండ్లూమ్ మహిళా కార్మికులు అరుణ, కవిత, మంజుల, సులోచన, భాగ్యలక్ష్మి, అనురాధ పాల్గొన్నారు.