హైదరాబాద్

శోభయాత్రకు మస్తు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: ఈ నెల 25న శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందన్న సమా చారంతో భారీగా బలగాలను మోహరింప జేసి నిఘాను ముమ్మరం చేస్తున్నారు. నగరంలో పోలీస్ పరిధిలో ఉన్నత స్ధాయి అధికారులకు పర్యవేక్షణ ఏర్పాట్ల కోసం ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. అసాంఘిక శక్తులు, అల్లర్లకు పాల్పడే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. శోభాయాత్ర ఈ నెల 25న ధూల్‌పేట ఎగువన రాణి అవంతి బాయ్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న మహాకాలేశ్వరి మందిర్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమై గౌలిగూడ రామమందిరం వద్దకు చేరుకోవడంతో సమాప్తమవుతుందని తెలిపారు. శోభాయాత్ర జరిగే దారిపొడవునా సిసి కెమెరాల ఏర్పాటు, సాయుధ బలగాల రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. కాగా ట్రాఫిక్ మళ్లింపు కోసం ట్రాపిక్ విభాగం అధికారులతో సిపి సమావేశమై సూచనలు చేశారు. ఆసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మల్లేపల్లి క్రాస్ రోడ్ మీదుగా విజయనగర్ కాలనీ, మొహిదీపట్నం వైపునకు, బోయిగూడ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఆగాపురా లేదా హబీబ్‌నగర్ వైపునకు, ఆగాపురా, హబీబ్‌నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను దారుస్సలాం వైపునకు, పురానాపూల్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పెట్లూబుర్జ్, కార్వాన్ లేదా కుల్సుంపురా వైపునకు మళ్లిస్తారు. ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సిపి ఆదేశించారు. అలాగే ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు సిపి ఆదేశించారు. జంట నగరాల్లో 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరపరాదని అన్ని మద్యం దుకాణాలు, బార్లను ఆదేశించారు.