హైదరాబాద్

సకాలంలో పూరి తకాకుంటే.. మునకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: మహానగరంలోని అన్ని నాలాల్లో ప్రతి వేసవి కాలం ముగిసేలోపే పూడికతీత పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల వెలుగుచూసిన కుంభకోణం భయంతో పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోయినా, కాస్త ఆలస్యమైనా, మొత్తం రూ. 34.46 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఎట్టకేలకు అధికారులు 80 శాతం పనులకు టెండర్లను పూర్తిచేశారు. కాస్త లేటయినా..పనులను లేటెస్టుగా చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వేసవి పూర్తయ్యేలోపు పనులు పూర్తికాకపోతే వచ్చే వానాకాలంలో నగరం మరోసారి నీట మునగాల్సిన ప్రమాదం పొంచి ఉంది. కానీ ఇప్పటివరకు ఎపుడూ కూడా పూర్తి స్థాయిలో పనులు సకాలంలో పూర్తిచేసిన దాఖలాలు లేకపోవటంతో ఏడాది పొడువునా ఈ ప్రక్రియను చేపట్టాలని ఇటీవలే మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేయటంతో పనులు కాస్త వేగవంతమైనట్టే అయి, ఉన్న నాలుకకు మందేస్తే, కొండనాలుక ఊడిందన్నట్టు ఆకస్మికంగా ఆగిపోయాయి. ఈ పూడికతీత పనులకు సంబంధించి సెంట్రల్ జోన్‌లో కుంభకోణం వెలుగుచూడటంతో ఆ భయంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. కానీ అధికారులు మొత్తం 292 పూడికతీత పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఇందులో భాగంగా 83 మేజర్ నాలాల్లో యంత్రాల ద్వారా, 26 డ్రెయిన్‌లలో రీసైక్లర్స్, 183 చిన్న సైజు నాలాల్లో మాన్యువల్‌గా పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలాల్లో పూడిక వ్యర్థాలను తొలగించటంతో పాటు పూడిక మట్టిని సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత కూడా కాంట్రాక్టరేదనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పూడికను ఎక్కడబడితే అక్కడ వేయకుండా లోతట్టు ప్రాంతాలు, క్వారీల గుంతల్లో వేయాలని కూడా సూచిస్తున్నారు. ఈ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఆరోపణలు తలెత్తకుండా ఉండేందుకు గాను సోషల్ ఆడిట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పూడిక పనులు సందర్భంగా తొలగించిన మట్టి పరిమాణాన్ని తరలించిన వివరాలు, పాల్గొన్న కూలీలు, జేసీబీలతో కూడిన వివరాలను స్థానిక ప్రముఖులకే ధృవీకరణ సంతకాలను కూడా జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు సేకరిస్తున్నారు.
బల్కాపూర్ నాలాల్లో పనులు మొదలు
నాలాల్లో పూడికతీసే పనులు మొట్టమొదటగా షేక్‌పేటలోని బల్కాపూర్ నాలాల్లో ప్రారంభమయ్యాయి. విరాట్‌నగర్ నాలాల్లో రెండురోజుల క్రితం నుంచి యంత్రాల ద్వారా పూడికను తొలగిస్తున్నారు.