క్రైమ్/లీగల్

దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మార్చి 24: బ్యాంకులు, ఏటీఎం వద్ద అమాయక ప్రజల దృష్టి మరల్చి వారి ఏటీఎం కార్డులను దొంగిలించి అందులోని డబ్బులను కాజేస్తున్న దొంగను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలను ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేష్ శనివారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం క్రిష్ణాపురం గ్రామానికి చెందిన డి.చంద్రారెడ్డి కుమారుడు దండనగారి సిద్దేశ్ అలియాస్ సిద్దేశ్ రెడ్డి (27) బికాం వరకు చదువుకున్నాడు. స్థానికంగా ఉండే సోలార్ ప్లాంట్ దినసరి కూలీ పని చేస్తుండేవాడు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకుని పక్కా ప్లాన్ ప్రకారం ఏటీఎం కార్డుల ద్వారా డబ్బులు దొంగిలిస్తున్నాడు. ఇప్పటికే అతనిపై పీడీ యాక్ట్ పెట్టడంతో సంవత్సరం పాటు జైలు జీవితం గడిపాడు. ఇటీవల కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉప్పల్, మేడిపల్లి ప్రాంతానికి చెందిన బాబురావు (57) తులసీ నగర్ ఎస్‌బి ఐ బ్రాంచిలో జీతం డబ్బులు విత్‌డ్రా చేసుకోవాడానికి వెళ్లాగా సిద్దేశ్ అతనికి మాయ మాటాలు చెప్పి అతని నమ్మించి ఏటీ ఎం కార్డుతో పాటు పిన్ నెంబర్ తీసుకుని పరిపోయాడు. 2వ తేదిన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం కాచిగూడ పరిసరా ప్రాంతాల్లోని ఏటీ ఎం సెంటర్ల వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న సిద్దేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దీంతో అతన చేసిన దొంగతనలను ఒప్పుకున్నాడు. సిద్దేశ్ ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 17 కేసుల్లో నింధితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. వివిధ వక్తులను మోసం చేసి వారి వద్ద నుంచి రూ.2.40లక్షలు కాజేశాడు. సిద్దేశ్ నుంచి రూ.2.30 లక్షలను పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు. విలేఖరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ టి.గో వింద్ రెడ్డి, కాచిగూడ ఏసీపీ నర్సయ్య, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, డిఐ యాదేందర్, ఎస్‌ఐ శ్రీను పాల్గొన్నారు.