హైదరాబాద్

మహిళా రక్షణపై చర్చించే అవకాశం ఇవ్వలేదు: జీవన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 27: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సభలో చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యంతో వీణవంకలో యువతి దారుణంగా అత్యాచారానికి గురైందని ఆరోపించారు. పోలీసుల వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం ఓ వైపు ఢంకా బజాయించుకుంటుంటే మహిళలపై ఆకృత్యాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇద్దరు యువతుల్లో ఓ యువతి తప్పించుకొని సమాచారాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని విమర్శించారు. సంఘటన జరిగిన అనంతరం పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదని, బాధిత యువతిని వైద్యపరీక్షకు పంపకుండా రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో పెట్టుకొని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని, సిఐ, డిఎస్‌పిలను సైతం సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు నింధితులకు మద్దతుగా ఉంటున్నారని, యువతిపై అత్యాచారం చేసినవారిలో ఓ యువకుడిన్ని బాలనేరస్థుడనిగా చూపడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ అంశంపై తాము చర్చకు కోరితే ప్రభుత్వం తిరస్కరించిందని విమర్శించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వాకౌట్ చేసినట్టు చెప్పారు.
పాడిరైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
- వంశీచందర్ రెడ్డి
పాడిరైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి విమర్శించారు. పాడి రైతులకు ఓ చేతితో రాయితీలు ఇస్తూ మరోచేతితో లాక్కొంటుందని అన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు విజయ డైయిరీ లీటర్‌కు రూ.4 ఇస్తామని చెప్పి.. గత సంవత్సరం రూ.71కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.16కోట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పశులకు పశుగ్రాసం అందుబాటులో లేదని, ఆసుపత్రుల్లో పశువుకు మందులు ఇవ్వడం లేదని ఆరోపించారు. టిఎస్‌ఐపాస్ అద్భుతమని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు స్థాపించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఎంత రాయితీలు ఇచ్చారు.. పరిశ్రమల్లో స్థానికులకు ఏ మేరకు అవకాశం ఇస్తున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. ఆర్భాటమే తప్ప టిఎస్‌ఐపాస్‌తో సాధించింది ఏమి లేదని విమర్శించారు.
చేనేతకారులు ఎదుర్కొంటున్న సమస్యలు
పరిష్కరించాలి
- సున్నం రాజయ్య
రాష్ట్రంలో చేనేతకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. వ్యవసాయం తరువాత అత్యధికులకు ఉపాధినిస్తున్న రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో చేనేతలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, మూడు బడ్జెట్‌లు గడిచినా ఇప్పటి వరకు కేటాయించలేదని చెప్పారు. ఈ విషయంపై సభలో చర్చించి వారిని ఆదుకోవాలని కోరారు.