హైదరాబాద్

లబ్ధిదారుల పేర్లు రాత్రికి రాత్రే మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: ‘కొండ నాలుకకు మందేస్తే... ఉన్న నాలుకు ఊడిందన్న’ చందంగా తెలంగాణలో పౌరసరఫరాల శాఖ పనితీరు కొనసాగుతుంది. అర్హులైన లబ్దిదారులందరికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యమిచ్చి పేదల కడుపునిండా భోజనం పెడుతున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనకు భిన్నంగా పౌరసరఫరాల శాఖ వ్యవహరిస్తుందంటే అతిశయోక్తి కాదు. రూపాయికి కిలోబియ్యం ఇచ్చినా ప్రతినెలా వారికి రేషన్‌కార్డు ఉందో పోయిందో తెలియక కొందరు, ఉంటే ఏ దుకాణంలో ఉందో తెలుసుకోలేక మరికొందరు లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ‘మీ’ సేవకో, ‘ఈ’ సేవకో, లేక ఇంటర్నెట్‌నో ఆశ్రయించి పది రూపాయలు ఇచ్చి తమ రేషన్‌కార్డు ఎక్కడుందో తెలుసుకుంటే తప్ప వారికి సర్కారు ఇచ్చే బియ్యం దక్కే పరిస్థితిలేదు. ప్రతి నెలా, ప్రతి దుకాణంలో కనీసం 100మంది లబ్దిదారుల పేర్లు మాయమవుతున్నాయంటే ఇది ఆన్‌లైన్ తప్పిదమా? లేక అధికారులు చేసే మాయనో తెలియక నిరుపేద వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో నాలుగు కిలోల బియ్యం ఇచ్చినా ప్రతి నెలా రేషన్ వస్తుందన్న నమ్మకం ఉండేదని, కానీ దానికి భిన్నంగా పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం అర్హులు ఎంతమందిని జాబితాలో చేరుస్తున్నారో అంతేమందిని ప్రతినెలా జాబితాలో పేర్లను తొలగిస్తూ ప్రతినెలా రేషన్ వస్తుందో లేదో తెలియని ఆందోళన పరిస్థితిని నెలకొల్పుతున్నారు. ఇప్పటివరకు రేషన్ డీలర్లు భారీఎత్తున కుంభకోణాలకు పాల్పడుతున్నారని, పేదల బియ్యం బినామీ పేర్లతో కొల్లగొడుతూ టన్నులకొద్దీ రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ కోట్లాది రూపాయల్ని అక్రమంగా ఆర్జిస్తున్నారన్న ఆరోపణలపై ఎస్‌ఓటి పోలీసులతో దాడులు చేయించి అక్రమార్కులపై పిడి చట్టాన్ని అమలుపరుస్తూ కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అసలైన లబ్దిదారుల పేర్లను ఎందుకు తొలగించాల్సి వస్తుందో వివరించాలన్న ప్రశ్నలకు మాత్రం పౌరసరఫరాల శాఖ అధికారులనుండి స్పష్టమైన సమాధానం రాకపోగా ఎవ్వరి పేర్లను తొలగించడంలేదంటూ ఇచ్చే వివరణలో ఆంతర్యమేమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా వుండగా రేషన్ సరుకులను కేవలం లబ్దిదారులకే అందేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానంతో ఇ-పాస్‌ను అమలుచేస్తున్నా అసలైన లబ్దిదారులకు సకాలంలో రేషన్ దొరికే పరిస్థితి కనిపించడంలేదు. వద్దనలేక పొగబెట్టారన్న చందంగా ప్రభుత్వం డీలర్లు స్వచ్ఛందంగా వైదొలిగేవిధంగా వ్యవహరిస్తూ కనీసం కమిషన్లుకూడా పెంచకుండా బయోమెటిక్ విధానాన్ని అమలు పర్చడంతో రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు డీలర్లు రాజీనామాలు చేశారు. గ్రేటర్ పరిధిలో గతంలో భారీ సంఖ్యలో రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించుకుని సొమ్ము చేసుకునే పరిస్థితి ఉన్న నేపధ్యంలో ఒక్కొక్క డీలర్ సుమారు మూడునుండి 30 దుకాణాల వరకు ఒక్కరే లీజుపై నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. అదే సమయంలో అధికారులు కఠినంగా వ్యవహరించి అక్రమార్కులపై నిఘా పెంచడంతోపాటు ఈ-పాస్ విధానాన్ని అమలుచేస్తున్న తరుణంలో భారీ సంఖ్యలో రేషన్ డీలర్లు స్వచ్ఛంగా తప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. రేషన్ అక్రమరవాణాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అసలైన లబ్దిదారుల పేర్లను జాబితాలోనుండి ఎందుకు తొలగిస్తున్నారో వివరణ ఇవ్వాలని లేదా ఆన్‌లైన్ విధానంలో తప్పిదాలు దొర్లితే కారకులపై కఠిన చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలన్న డిమాండ్లు ముందుకు వస్తున్నాయి.