క్రైమ్/లీగల్

ఖైదీ మృతిపై 30న విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నెంబరు 574 నల్లదానయ్య(33).. 2014 అక్టోబర్ 20న సికింద్రాబాద్‌లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏప్రిల్ 30న సోమవారం ఉదయం 11 గంటలకు దానయ్య మరణంపై విచారణ జరుగుతుందని కందుకూరు రాజస్వ మండలాధికారి (రెవెన్యూ డివిజనల్ అధికారి) సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ సీహెచ్ రవీందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిపినవారు తమ వాంగ్మూలాన్ని ఏప్రిల్ 30న నిర్వహించే విచారణలో తెలియజేయాలని తెలిపారు.
చిరుత అలజడి
కులకచర్ల, ఏప్రిల్ 10: కులకచర్ల మండలం అనంతసాగర్‌లో మళ్లీ చిరుత కలకలం రేపింది. గత నెలలో హైనా దాడి చేసి మేకపిల్లను హతమార్చగా, తాజాగా సోమవారం రాత్రి చిరుత దాడి చేసి లేగదూడను చంపేసింది. అనంతసాగర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు చాలారోజుల నుంచి ప్రజలు భయపడుతున్నారు. పొలాల దగ్గర ఉన్నటువంటి దూడలపై దాడులు చేస్తూ ఇక్కడి రైతాంగాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి చిరుత సంచారం వెలుగులోకి రావడంతో అనంతసాగర్, కుసుమసంద్రం గ్రామాలకు చెందినవారు రాత్రి కాగానే బిక్కుబిక్కుమంటూ, ఇల్లు విడిచి బయటకు వెళ్లలేక పోతున్నారు. రాత్రి వేళల్లో పొలాల దగ్గర పడుకునే సాహసం కూడా చేయలేకపోతున్నారు. పొలాల దగ్గరకు వెళ్లకపోవడమే మంచిదని అటవీశాఖ అధికారలు సూచిస్తున్నారు.