హైదరాబాద్

పాతబస్తీకి ఇప్పట్లో మెట్రో లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: మహానగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రోరైలు పాతబస్తీలో ఇప్పట్లో కూత పెట్టేలా లేదు. మూసీ నదీకి ఇటువైపు పనులు చకచక సాగుతున్నా, పాతబస్తీలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. మొత్తం మూడు కారిడార్లలో జెబిఎస్-్ఫలక్‌నుమాల మధ్య ఏర్పాటు చేస్తున్న కారిడార్ 2లో పనులు నత్తనడకన సాగుతుండగా, మిగిలిన కారిడార్లలో పనులు చకచక కొనసాగుతున్నాయి. అయితే అప్పట్లో మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్ 1లో కూడా అసెంబ్లీ వద్ద, అలాగే కారిడార్ 2లో సాలార్‌జంగ్ మ్యూజియం వద్ధ అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలన్న డిమాండ్లు విన్పించినా, ముందు నిర్ణయించిన అలైన్‌మెంట్ ప్రకారమే మెట్రోపనులు చేపట్టనున్నట్లు పనులు చేపడుతున్న కన్సార్టియం ఎల్ అండ్ టి చీఫ్ గాడ్గిల్ తేల్చి చెప్పినా, పాతబస్తీలో ఎక్కడా కూడా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
వచ్చే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కల్లా కోర్ సిటీలోని రెండు కారిడార్లలో మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నా, పాతబస్తీ వాసులకు మాత్రం మెట్రో రైలు కాస్త ఆలస్యంగానే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే స్థల సేకరణ కూడా ఆశించిన స్థాయిలో జరగకపోగా, తాజాగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని 41 కిలోమీటర్లలో ప్రభుత్వం ఈస్ట్‌వెస్ట్ కారిడార్‌ను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే! స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ రెండో దశ కింద చేపట్టనున్న ఈ కారిడార్‌లో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడకుండా స్కైవేలు, ఫ్లైఓవర్లు వంటివి నిర్మించనున్నారు. అయితే వీటి జరపనున్న స్థల సేకరణను మెట్రోరైలును దృష్టిలోపెట్టుకుని చేపట్టాల్సి ఉన్నందున, కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. అంతేగాక, ఇదే కారిడార్‌లోని గౌలీగూడ బస్ స్టేషన్ వద్ధ మూడో వంతెనను నిర్మించి పైన మెట్రో స్టేషన్, కింద బస్ స్టేషన్‌ను నిర్మించేందుకు మహానగర పాలక సంస్థ ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

భూ కబ్జాలపై చర్యలకు డిప్యూటీ సిఎం హామీ

హైదరాబాద్, మార్చి 28: శాసనసభ సమావేశంలో భాగంగా సోమవారం నాటి సభలో నగరంలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న భూకబ్జాల వ్యవహారం చర్చకు వచ్చింది. ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సమాధానం చెబుతూ సభ్యులు టి.రాజాసింగ్ పేర్కొన్న విధంగా గవషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కబ్జాల పాలవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. గోషామహల్ ప్రాంతంలో 52వేల 96 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 153 పాతకాలం అక్రమాలున్నట్లు గుర్తించామన్నారు. ఎల్‌ఐజి చట్టం కింద ఇక్కడి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశామని ఆయన వెల్లడించారు. 2010 సెప్టెంబర్ 24వ తేదీన స్థానిక తహసిల్దార్ ఉత్తర్వులను ఆమోదించటం జరిగిందని, సుమారు 3వేల చదరపు గజాల స్థలంలోని ఆక్రమణలను తొలగించి 2011 జూలై 4వ ఏదీన ఏపిసిపిడిసిఎల్‌కు అప్పగించినట్లు మహమూద్ అలీ వెల్లడించారు. అంతేగాక, ఇక్కడి ఆక్రమణలకు సంబంధించి కొందరు కోర్టులను ఆశ్రయించటంతో ప్రస్తుతం ఈ వ్యవహారం సిటి సివిల్ కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. కేవలం గోషామహల్ అసెంబ్లీలోనే గాక, నగరంలోని దాదాపు అన్ని మండలాల్లోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని వివరించారు. ఎలాంటి వివాదాల్లేని భూములకు సంబంధించి మాత్రమే పేదలకు పట్టాలిచ్చినట్లు ఆయన వెల్లడించారు.