హైదరాబాద్

నవ్వుల హరివిల్లు ‘తెలంగాణ లాఫర్ షో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: స్వచ్ఛ భారత్ అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యత కాదు. ప్రజలుకూడా భాగస్వాములవ్వాలనే నినాదంతో హాస్యాన్ని జోడించి సోమవారం సాయంత్రం రవీంద్రభారతిలో షబీర్‌ఖాన్ బృందం ప్రదర్శించారు. ఎంజిఎం ఆర్ట్స్ ఈవెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమలో ప్రభుత్వ పాలనపై వ్యగ్యంగా మాటల తూటాలతో హాస్యాన్ని మేళవించి ప్రేక్షకులపై నవ్వుల జల్లు కురిపించారు. కేవలం ప్రదర్శన మాత్రమే కాదు. పరోక్షంగా ప్రభుత్వ పథకాల ప్రచారంగా ఈ కార్యక్రమం సాగింది. ప్రజా సమస్యలను చూపుతూ వాటి పరిష్కారానికి మార్గం చూపుతున్నట్లుగా సరదాగా సాగింది. కార్యక్రమంలో అలీనా, నూర్ మారియా, షబ్బీర్‌ఖాన్, మునావర్ అలీ, కెబి జానీ, సూరజ్ కిరణ్, మాధురీ షబ్నం పాల్గొన్నారు. హిందీ సినిమాలలోని అలనాటి సూపర్‌హిట్స్‌ను సుమధుర గీతాలుగా ప్రేక్షకులకు అందించారు. కార్యక్రమానికి మహ్మద్ మూసా సిద్దిఖ్, ప్రొ.ఎస్.ఎ. శుకూర్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు శాంతి దేవి పాల్గొని కళాకారులను అభినందించారు.