హైదరాబాద్

సంస్కరణలు.. పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: జీహెచ్‌ఎంసీ ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు ఫలించి, పురస్కారాలను సాధించి పెడుతున్నాయి. గడిచిన రెండు ఏళ్లుగా జీహెచ్‌ఎంసీకి వివిధ రకాల జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డుల పంట పండుతోంది. కొద్దిరోజుల క్రితమే పెద్ద ఎత్తున హౌజింగ్ స్కీంను అమలు చేస్తున్నందున హాడ్కో అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే! గత ఆర్థిక సంవత్సరం 2017-18లో జీహెచ్‌ఎంసీకి పర్యాటకులకు అవసరమైన సేవలు, ఉత్తమ పౌరసేవల నిర్వాహణ అంశంలో కేంద్ర ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తమ జాతీయ పర్యాటక పురస్కారాన్ని స్వీకరించింది. ఇపుడు తాజాగా దేశంలోని అన్ని స్థానిక సంస్థల దృష్టిని ఆకట్టుకునేలా ఏకంగా ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును కైవసం చేసుకుని దేశంలోని పురపాలక సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. కోటి మంది జనాభాకు పౌరసేవలు, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులను చేపడుతున్న జీహెచ్‌ఎంసీ దేశంలోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే! ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలుచేస్తూ దేశంలో మరెక్కడ లేనివిధంగా పేదలపై పైసా భారం పడకుండా ఉచితంగా ఏకంగా లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్నందున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో జీహెచ్‌ఎంసీని పీఎం ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పంపిన లేఖలో పేర్కొంది. అవార్డును ఈనెల 21న నిర్వహించే సివిల్ సర్వీసెస్ దినోత్సవలో భాగంగా న్యూదిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్వీకరించనున్నారు. ఇంతకు ముందు ట్రేడ్ లైసెన్సుల ఫీజులను పెంచుకుని, తద్వారా ఆదాయ వనరులను శాశ్వత ప్రాతిపదికన పదిలపర్చుకున్నందుకు న్యూఢిల్లీకి చెందిన ‘స్కొచ్’ గ్రూప్ తరఫున ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను కైవసం చేసుకుంది.
తొలి ప్రయోగానికి చక్కటి గుర్తింపు
భవన నిర్మాణ అనుమతులను ఆన్‌లైన్‌లో జారీ చేసే ప్రక్రియ డెవలప్‌మెంట్ బిల్డింగ్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(డీపీఎంఎస్)ను ప్రవేశపెట్టినందుకు స్కొచ్ అవార్డు సిల్వర్ అనే మరో పురస్కారం కూడా జీహెచ్‌ఎంసీ ఖాతాలో చేరిన సంగతి తెలిసిందే! దీనికితోడు ఫైళ్లు, రికార్డ్సును డిజిటలైజేషన్, రెవెన్యూ అంశాలకు సంబంధించి మరో ప్రత్యేక పురస్కారాలు కూడా వచ్చాయి. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం, వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రవేశపెట్టిన ‘హెచ్‌ట్రీమ్స్’ ప్రాజెక్టుకుగాను బెస్ట్ అర్బన్ మోబిలిటీ ఇండియా అవార్డును కేంద్ర ప్రభుత్వ హౌజింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అందుకుంది. దీంతో పాటు స్టేట్ ఎనర్జీ కన్వర్జేషన్ అవార్డు, ఘన వ్యర్థాల నియంత్రణలో మెరుగైన పద్ధతులను అవలంభిస్తున్నట్లు వేస్ట్‌మేనేజ్‌మెంట్ ఎక్సలెన్స్ అవార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశాలకు సంబంధించి గత సంవత్సరం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పురస్కారాలను సాధించింది. ఇదిలా ఉండగా, నగరంలో శాశ్వత ప్రాతిపదికన ఫుట్‌పాత్‌ల పరిరక్షణ, వాహనాల రాకపోకలు, సంఖ్యకు తగిన విధంగా ఆధునిక పార్కింగ్ వంటి అంశాలకు సంబంధించి మరిన్ని సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టేలా కసరత్తు కొనసాగుతోంది.