హైదరాబాద్

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్: ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నికీలలు ఎగిసిపడి మంటలు వ్యాపించాయి. వెంటనే గమనించిన సిబ్బంది.. విద్యుత్ సరఫరాను నిలిపివేసి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే పలు ఫైళ్లతో పాటు కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం ఎంతో తెలియాల్సి ఉంది. సీఎం అధికారిక నివాసానికి కూతవేటు దూరంలోని విద్యుత్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. స్వల్ప వ్యవధిలోనే మంటలు ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.