హైదరాబాద్

మున్నూరు కాపులను బీసీ-ఏలో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: మున్నురు కాపు కులస్థులను బీసీ-డీ నుండి ఏ గ్రూప్‌లోకి మర్చాలని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి, పాతనగర మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడు పర్వాతాల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫలక్‌నుమాలోని బండ్లాగుడ మండలం తహాసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో అత్యధికంగా మున్నూరు కాపులున్నారని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా, విద్యపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. మున్నూరు కాపులు బీసీ-డీ గ్రూప్‌లో ఉండటం చేత అనేక రకాలుగా నష్టపోతున్నారని, ఉద్యోగ రిజర్వేషన్లు, ప్రభుత్వం ప్రవేశపేడుతున్న సంక్షేమ పతకాలు సకాలంలో అందక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని కోరుతూ బండ్లగూడ తాహసీల్దార్‌కు రాజేందర్ వినతి పత్రం సమర్పించారు.

శాస్ర్తియ పద్ధతిలో సాగుతో మంచి దిగుబడులు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 23: శాస్ర్తియ పద్ధతిలో సాగు చేస్తే దిగుబడి ఎంతో బావుంటుందని రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ ప్రధాన శాస్తవ్రేత్త డాక్టర్ ఎం.హనుమాన్ నాయక్ అన్నారు. సోమవారం ఉద్యాన విశ్వవిద్యాలయ కళాశాల పరిశోధనా స్థానంలో కొత్తిమీర, వాము, మెంతులు, సోంపు పంటల సాగు పద్ధతులపై రైతు శిక్షణ నిర్వహించారు. శిక్షణలో భాగంగా రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తిమీర, వాము, మెంతులు, సోంపు పంటలను సాగు చేసే పద్ధతులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందవలసిన దిగుబడి గురించి వివరించారు. రైతులకు శిక్షణ ఎంతో మేలు చేస్తుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ప్రధాన శాస్తవ్రేత్త డీ.అనితకుమారి.. చీడపీడల నివారణ గురించి రైతులకు వివరించారు. తెగుళ్లు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో సీనియర్ శాస్తవ్రేత్త రాంరెడ్డి, కాంట్రాక్ట్ సైంటిస్టులు యాదగిరి, లాలు నాయక్, సూపరింటెండెంట్ రజనీకాంత్, ఏఈవోలు యాదయ్య, కుమార్, ప్రతాప్‌సింగ్, శంషాబాద్ ఎంపీటీసీ జీవీ అరవింద్ కుమార్, మల్ల రమేష్, మంగళ రత్నం, శంకర్ రావు పాల్గొన్నారు.

మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో విద్యార్థుల ప్రతిభ
హయత్‌నగర్, ఏప్రిల్ 23: నేషనల్ సైన్స్, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లెవల్-2 పోటీ పరీక్షల్లో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మనె్నగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన సంహిత, అనుశ్రీ, అనన్య వరుస ర్యాంకులు సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సంగమేశ్వర్ గుప్త అభినందించారు. విద్యతో పాటు పోటీ పరీక్షలలో రాణించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బిట్ల శైలజ, చింతల వీణ, ప్రిన్సిపాల్ విశ్వనాథ్ రెడ్డి, కోఆర్డినేటర్లు సత్యవతి, దీపిక, పూర్ణిమ, సౌమ్య, క్యాంపస్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

రంజాన్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలి
* ఎమ్మెల్యే ప్రభాకర్
ఉప్పల్, ఏప్రిల్ 23: రంజాన్ పండుగ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, కాప్రా సర్కిల్ ఉన్నతాధికారులతో సోమవారం ఎమ్మెల్యే ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పండుగ నేపధ్యంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో ఉన్న మజీద్‌ల వద్ద కావలసిన సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు, వీధి దీపాలు, నీటి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు, ఇఇలు రాజయ్య, కోటేశ్వర్‌రావు, ఏఎంహెచ్‌ఓ ఉమా గౌరీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అంతకుముందు మజీద్‌ల వద్ద అవసరమైన సౌకర్యాల కోసం మజీద్ కమిటీ పెద్దలు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.