హైదరాబాద్

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వివరించారు. బుధవారం అంధ విద్యార్థుల వసతి గృహాన్ని ఆసిఫ్‌నగర్ మండలంలోని ఎంజీనగర్‌లో ప్రారంభించారు. నానల్‌నగర్‌లో అద్దె భవనంలో అంధ విద్యార్థుల వసతి గృహాం నడిచేదని, ఇపుడు సొంత భవనంలోకి మారటం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులకు సౌలభ్యంగా పూర్తి స్థాయి వసతులతో ఉండేందుకు అనువుగా ఉండేలా రూ.కోటి వ్యయంతో సొంత భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనానికి వౌలిక వసతులన సమకూర్చేందుకు రాజ్యసభ సభ్యుడు కే.కేశవ రావు తన నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి రూ.15లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. భవనంలో అదనంగా ఒక అంతస్తు నిర్మించి, కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అంథ విద్యార్థుల వసతి గృహానికి త్రాగునీటి వసతి కల్పించేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ లాడ్స్ నుంచి రూ. పది లక్షల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఇన్‌చార్జి జేసీ శ్రీవత్స కోట, రాష్ట్ర వికలాంగుల సహాకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, కార్పొరేటర్ అయేషా రుబీనా, కో ఆప్షన్ కార్పొరేటర్ మహమూద్ హుస్సేన్, ఆర్డీఓ చంద్రకళ, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ సుదర్శన్ పాల్గొన్నారు.