హైదరాబాద్

ఆసుపత్రులు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుప్రతిలో పరిస్థితులు మెరగుపడలేదని, సర్కార్ ఆసుపత్రి అంటేనే రోగులు భయంతో పరుగులు తీయాల్సి వస్తోందని టీడీపీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస రావు విమర్శించారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తామని, సౌకర్యాలను మెరుగుపరుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి మూడేళ్లు గడుస్తున్నా, నేటికీ అతీగతీ లేకపోవటాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు గురువారం ఉస్మానియా ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టిన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి, అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఫలితంగా కాసేపు ఉస్మానియా ఆసుపత్రి ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. నగర అధ్యక్షుడు ఎంఎన్ మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వైద్యం కోసం వచ్చిన రోగులపై పెచ్చులూడి పడుతూ, వారిని ఆందోళనకు గురి చేస్తోందని వివరించారు. మెరుగైన వైద్యం దేవుడెరుగు, కానీ, ఉస్మానియా ఆసుపత్రికి వస్తే రోగుల ప్రాణాలు హరీమనే పరిస్థితులు నెలకొన్నా, పట్టించుకోకపోవటం ప్రజారోగ్య పరిరక్షణ లేకపోవడం.. ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రి సర్కారు నిర్లక్ష్యంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని, ఎపుడు కుప్పకూలుతుందో తెలియని అయోమయం నెలకొందని చెప్పారు. నగరాన్ని విశ్వనగరంగా మార్చుతామని అర్థరహితమైన ప్రకటనలు చేసి కాలయాపన చేస్తున్న ప్రభుత్వం నగరాన్ని అవినీతిలో ప్రపంచ రాజధానిగా మార్చేసిందని విమర్శించారు. పార్టీ ప్లీనరీపై చూపించే శ్రద్ధలో పదో వంతు ప్రజారోగ్యంపై చూపితే నేడు ప్రజారోగ్యం, ప్రభుత్వ వైద్యం ఆందోళనకరంగా మారేది కాదని శ్రీనివాస రావు పేర్కొన్నారు. పేదలు, వారి సంక్షేమం, పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే అంశంపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే ఉస్మానియా ఆసుపత్రి పునరుద్ధరణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో టీడీపీ మహిళా నేత షకీలా రెడ్డి, నేతలు కూన వెంకటేశ్ గౌడ్, వనం రమేశ్, దీపక్ రెడ్డి, బజరంగ్ శర్మ, బీఎన్ రెడ్డి, బద్రినాథ్ యాదవ్, బాలరాజ్ గౌడ్, ప్రదీప్ చౌదరి, కప్ప కృష్ణగౌడ్, మహిళా నేతలు ప్రమీలా, ఇందిరా, అన్నపూర్ణ, శోభ పాల్గొన్నారు.